ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పడి పడి లేచే మనసు - up and downs in love

 ఏంటి వే, అలా ఉన్నావు? అంటే? మనసు బాగోలేదు అంటారు. అసలు ఈ మనసు ఎక్కడుందో? ఏంటో... దీని బాధలు? యుక్త వయస్సు రాగానే ఈ మనసు ఎక్కడ నుండి వచ్చి, శరీరంలో చేరుతుంది. ఇక చచ్చేదాకా పోదు మరి. పండక్కి ఇంటికొచ్చిన చుట్టంలా అతుక్కుపోయింది. ఉన్న మనసు, ఉన్న చోట ఉండక కొత్తగా ఇంకో మససు తో కలవాలి అంటుంది. ఉద్యోగం దొరకడం కష్టమేమో గానీ, మనసుదేముంది, ఊరికే దొరుకుతుంది. చదువుకున్న వాడికళ్ళ జాబ్ రాదు కానీ, మనసున్న వాడికల్లా ప్రేమ పుడుతుంది.





ఒక చూపులో:


ఓ చూపు చాలు మన్మదుడా... అంటూ ఓ పాట గుండె లో మొదలై జోరీగలా... జుయ్ అని చెవిలో మారు మోగుతుంది. అతను ఎదురుగా ఉంటే కాలం ఆగిపోతుంది. చెవులు కనపడవు, కళ్ళు వినపడువు. మీరు చదివింది నిజమే... ఇది ప్రేమ కాదా... తేడాగానే ఉంటుంది.
ఇక ఏముంది, ఆకలుండదు, దాహముండదు, నిద్దరుండదు. Talktime వేసుకోడానికి purse లో డబ్బులు ఉండవు. ఇప్పుడంటే free talktime... ప్రేమ పక్షులు దుమ్ము రేపుతున్నారు. అప్పట్లో మాకు నిమిషానికి రూపాయి మరి. రోజుకి 100/- అయ్యేది. 
ఆ తర్వత పెద్దల అదిరింపులు, పిల్లల బెదిరింపులు, ఆత్మ హత్యా ప్రయత్నాలు, కట్నాలు, కానుకలు, పెళ్ళి. 




టీ కప్పులో తుఫాను:

ముందు పేరా లో కథ సుఖాంతం అయింది కదా? కాలేదు.
ఈ ఇద్దరి కథ మొదలెడదామా...
అనుమానాలు, అపార్థాలు కలుగుతాయి. కష్టపడి పెళ్ళి చేసుకున్నారు కదా మరి! ఆ మాత్రం లేకపోతే ఎలా? కొట్టుకోవాలి... తిట్టుకోవాలి... చంపుకోవడం తప్ప అన్ని చేసుకోవాలి.


ఒకరినొకరు మెచ్చుకోండి:

కొంచం ఆగుదామా... ఇక్కడ! Ego లకు పోకుండా ఒకరి పనిని మరొకరు మెచ్చుకుందాం. ఒకరి ఐడియాస్ ను ఇంకొకరు అబినందిద్దం. వారి డ్రెస్సింగ్ స్టైల్ ను రెట్టింపు చేసి చెబుదాం. పొగిడితే పోయేదేముంది dude, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు తప్ప.

వాళ్ళు Fastrack watch తెచ్చిస్తే, Rolex లా ఫీల్ అవుదాం. షిఫాన్ saree కొనిస్తే కంచి పట్టు లా ఫీల్ అవుదాం. వారి కళ్లలో కళ్ళు పెట్టి కవితలెన్నో చెబుదాం.




మానసికంగా సన్నిహితంగా ఉండటం:

రోజులో నాకెంత టైం ఇస్తున్నాం అని అడుగుతాం కానీ... ప్రేమలో ఉన్నప్పుడు వారానికి ఒకసారి చూసుకుని ప్రతి నిమిషము వారి ఆలోచనలోనే గడిపిన విషయం మర్చపోకూడదు. ప్రేమ మానసిక మైనది, అది కాలం తో, కానుకలతో కొలిచేది కాదు.

తిన్నారా ? లేదా?, ఎక్కడున్నాడో... ఏం చేస్తున్నాడో అని ఆలోచించడమే ప్రేమ. మన తల్లి ప్రేమ మనకిదే నేర్పింది. సినిమా ప్రేమ మనకెందుకు? అమ్మ ఎప్పుడూ నాకెందుకు టైం ఇవ్వట్లేదు అని అడగదు. మనసులో మన క్షేమం కోరుకుంటుంది. అలా నిస్వార్థంగా ప్రేమిద్దాం.




నిజాయితీ మరియు నమ్మకంతో, కమ్యూనికేట్ చేయండి:

చాలామంది భార్యాభర్తల మధ్య జరిగేది కమ్యూనికేషన్ గ్యాప్. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం, ఒకరికొకరు చెప్పుకోలేక కోపంతో మౌనంగా ఉండిపోతారు. కాలం గడిచే కొద్దీ మాటలు మాయమవుతాయి, తరువాత మనుషులు దూరమై పోతారు.

అలకల కన్నా పలుకులు మేలు కదా! మీకు వారిలో నచ్చని విషయన్ని, డైరెక్ట్ గా వారికే చెప్పండి. అలిగి ఎక్కడికో వెళితే అనవసరమైన అపార్థాలు ఎక్కువైతాయి.


ముందుకు వెళ్ళడానికి ఒక అడుగు వెనక్కి వేయండి:

నేను నీతో ఇక ఉండలేను అని చెప్పడం చాలా సులువు. అలా ఉండలేక వెళ్లిపోవడం అంటే ఒక్కరే వెళ్ళలేరు. పెళ్ళి ఎలా రెండు కుటుంబాల వ్యవహారమో, విడాకులు కూడా అంతే. పెళ్లికి ముందు రెండు కుటుంబాలే, ఇప్పుడు మూడో వ్యక్తి కూడా ఉన్నారు. వారే పిల్లలు. 

అందుకే తెగతెంపుల వైపు ఒక అడుకు ముందుకు వేయడానికి ముందు, ఒక అడుగు వెనక్కి వేయండి.




మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేయండి:


ప్రేమలో పడ్డప్పుడు ఎలానూ వాడలేదు కదా ఈ పదాన్ని! ఇప్పుడైనా వాడుదాం. అపర్దాలను అదిమి పెట్టుకుంటూ... అమృతం కరిసిన రాత్రులను గుర్తుకి తెచ్చుకుంటూ... మనసారా కలిసిపోధాం. మనలా ఎవ్వరుండలేరని, వల్లకాదని, బల్ల గుద్ది చెబుదాం.

Thank you 🙏.

      
                               ✍️Bhagyamati.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్ర...

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ.....

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవి...