సకల కళా వల్లభుడు, సరసం కోరే సుందరుడు, నా కథలో నాయకుడు, నా కలలో మన్మధుడు... అమ్మాయిలు చదువయిపోయాక, ఇక ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసేప్పుడు ఈ పాట పాడుకుంటూ హాల్లో రౌండ్ గా తిరుగుతూ ఉంటారు, రింగా రింగ రోసెస్ లాగా... నేను పెళ్లి చేసుకునేవాడు ఇలా ఉండాలని, అలా ఉండాలని, ఎలానో ఉండాలని... నాలాంటి కళాకారులైతే డ్రీమ్ బోయ్ బొమ్మ గీసి, నాన్న నాకు వీడే కావాలి అంటారు.
సాధారణంగా అమ్మాయిల అంచనాలు:
అతను ఆత్మవిశ్వాసం కలిగివుండాలి:
ఆత్మవిశ్వాసం ఉన్న అబ్బాయిలు తమను తాము స్పష్టంగా మరియు సమర్థవంతంగా వ్యక్తీకరించగలుగుతారు. చురుకుగా వింటారు మరియు వారి ఆలోచనలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెబుతారు.
అతను అందంగా ఉండకపోయినా పర్వాలేదు, ధనవంతులు కాకపోయినా పర్వాలేదు, సెక్సీగా ఉండక పోయినా పర్వాలేదు, మంచి ఆత్మవిశ్వాసం కలిగిన వాడే ఉండాలి. ఆత్మవిశ్వాసం అతని మాటల్లో బాడీ లాంగ్వేజ్ లో కనిపించాలి. ఇలాంటి అబ్బాయి పక్కన అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా నడుస్తుంది, కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. ఈ ఒక్క క్వాలిటీ ఉంటే జీవితంలో ఏదైనా సాధించేస్తాడు, మనల్ని బాగా చూసుకుంటాడు అని మా నమ్మకం.
అతను నాయకుడై ఉండాలి:
ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు ఆ గ్రూప్ కి లీడర్ అయి ఉండాలి. ఎంతమంది చుట్టూ ఉన్న తన మాటలే వినపడుతుండాలి. తనే కనిపిస్తుండాలి, అతనే నాయకుడు, అలాంటి లీడర్ ని అమ్మాయిలు ఇష్టపడతారు. ఎందుకంటే అతను నలుగురిలో ఒక్కడు కాదు, నలుగురికి ఒక్కడు, నలుగురిని నడిపించగలడు. ఈ నాయకత్వ లక్షణాలు ఉండే అబ్బాయిల్ని అమ్మాయిలు హీరోలా చూస్తారు. అతనిని ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు.
మంచి శరీర సాష్టకం కలిగి ఉండాలి:
నా చిన్నప్పుడు మా నాన్న నెల్లూరులో కుస్తీ పోటీల్లో చాలా ప్రైసులు గెలుచుకున్నాడు. ఈ ఇన్స్పిరేషన్ నా మనసులో పడిపోయింది. మా ఇంట్లో ఉన్న ఆర్నాల్డ్ ( టర్మినేటర్ మూవీ లో హీరో) బుక్స్, బాడీ బిల్డింగ్ బుక్స్... ఇవన్నీ చూసి నేను ఇలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక అబ్బాయి అంటే ఒక స్ట్రాంగ్ బాడీ ఉండాలి, అదే నేను ఫస్ట్ క్వాలిటీ అనుకోని ఫిక్స్ అయిపోయాను. కానీ నిజానికి సర్వేల ప్రకారం డ్రీమ్ బాయ్ అంటే మంచి ఫిజిక్ ఉండాలి, అని కోరుకునేది కేవలం 13% అమ్మాయిలు మాత్రమే అంట. నా డ్రీమ్ బాయ్ అనుకోగానే నేను ఫస్ట్ గీసిన బొమ్మ కూడా అలానే ఉంటుంది. ఈ బొమ్మ చూపించ గానే మా నాన్న, ఆ ఇతనైతే సెంట్రల్ జైల్లో దొరుకుతాడు అన్నాడు. నేను అప్పుడు గీసిన బొమ్మ ఇంకా ఇప్పటికి నా దగ్గర ఉంది. చూడండి.
అతనికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి:
సాధారణంగా అమ్మాయిలము ఎక్కువ మాట్లాడతాం కాబట్టి మేము మాట్లాడేవన్ని వింటూ... వాటికి ఏదో ఒక బదులిస్తూ కొంచెం అయినా నవ్వుతుండాలి. తను ఏదో ఒక జోక్ వేస్తుండాలి, మమ్మల్ని నవ్విస్తుండాలి. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లు అసలు బోర్ కొట్టరు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. మన ఫ్రెండ్స్ ని వాళ్ళకి పరిచయం చేసినప్పుడు త్వరగా స్నేహం చేస్తారు అందుకని ఈ క్వాలిటీ చాలా అవసరం, అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా. నాలో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని అన్నారు మహాత్మ గాంధీ. అంటే ఇది ఎంత గొప్ప క్వాలిటీనో కదా!
అతను సెక్యూర్, కేరింగ్ పర్సన్ అయుండాలి:
అమ్మాయిలకి ఎప్పుడూ వాళ్ళ లైఫ్ లో హీరో వాళ్ళ నాన్న కాబట్టి నాన్నలా చూసుకునే అబ్బాయి కావాలి అనుకుంటారు. నాన్న ఏమి అడిగినా కొనిస్తారు, ఎంత డబ్బులు అడిగినా ఇస్తారు కాబట్టి అవన్నీ ఇలాంటి అబ్బాయిలు ఉండాలి అనుకుంటాము. నాన్నను వదిలేసి ఇతనితో రావడానికి ఈ కేరింగ్ అనేది మాకు చాలా అవసరం. చిన్నప్పుడు నాన్న చిటికెన వేలు పట్టుకొని మెయిన్ రోడ్ లో నడుస్తూ ఉంటే దూరంగా ఉన్న లైట్స్, పెద్ద గా ఉన్న రోడ్ కనిపించేది, అప్పుడు నాన్న మన పక్కన నాన్న ని చూస్తే సెక్యూర్ అనిపించేది. ఇతను చేయి పట్టుకొని నడిచేటప్పుడు కూడా అలా ఉండాలి. దట్ ఈస్ కేరింగ్.
ఇంతసేపు చెప్పకుండా ఆపుకున్న ఫైనల్ గా అమ్మాయిలకి కావాల్సింది నాన్న లాంటి భర్త. ఎందుకంటే... నాన్న మా లైఫ్ లో ఫస్ట్ లవ్ కాబట్టి.
Thank you 🙏🏻
✍🏻Bhagyamati.
Very nice..!!
రిప్లయితొలగించండిThank you
తొలగించండి