బయట బాగా వర్షమొస్తోంది, అయిన ఆఫీస్ అయిపోయాక అక్కడేం చేస్తాం! తడుచుకుంటూ ఇంటికి వచ్చేయాలి. ఆగండి, మధ్యలో ఆగండి. టీ షాప్ లో atmosphere బాగుంటుంది, ఆగి టీ తాగి వెళ్దాం.
ఇంటి కెళ్ళడానికి అరగంట పడుతుంది, ఈ మధ్యలో ఇలా ఆగి వర్షం లో తడిచి, పార్టనర్ తో టీ తాగుతుంటే భలే ఉంటుంది. దారిన పోయే దానయ్యలను పట్టించుకోకండి.
మీరు చల్లగా ఉంటే, టీ మిమ్మల్ని వేడి చేస్తుంది;
మీరు చాలా వేడిగా ఉంటే, అది మిమ్మల్ని
చల్లబరుస్తుంది;
మీరు డల్ గా ఉన్నట్లైతే, అది మిమ్మల్ని
ఉత్సాహపరుస్తుంది;
మీరు ఉత్సాహంగా ఉంటే, అది
మిమ్మల్ని ప్రశాంతపరుస్తుంది.
నిన్న మీ ఆవిడతో గొడవపడ్డారా? ఈరోజు
ఉదయాన ఆమె కంటే ముందు లేచి, ఒక
కప్పు టీ పెట్టి ఆమె చేతికి ఇవ్వండి.
కప్పులో చక్కెరల ఆమె కోపం ఇట్టే
కరిగిపోతుంది.
సోషల్ డ్రింక్స్:
టీ మరియు కాఫీ ని సోషల్ డ్రింక్స్
అంటారు. అంటే మన స్నేహితులతో,
కుటుంబ సభ్యులతో కలిసి తాగుతాము
కాబట్టి.
ఒక కప్పు టీ గొప్ప ఆలోచనలను గొప్ప
మనస్సులతో పంచుకోవడానికి ఒక సాకు.
అందుకే కొత్తగా ఫ్రెండ్ అవగానే టీ కి
వెళ్దామా అంటాము. కాసేపు
మాట్లాడుకుందామా? అంటే no
చెబుతారు కాబట్టి, టీ అంటే ok అంటారు
కాబట్టి. ఇంకొంచెం స్వీట్ గా పిలవాలంటే
ఇలా... రండి, కొంచెం టీ తాగి,
సంతోషకరమైన విషయాల గురించి
మాట్లాడుదాం. జీవితం ఒక కప్పు టీ తో
"బ్యూటిఫుల్ " అవుతుంది.
టీ ఎప్పుడు పుట్టింది?
కరోనా వైరస్ ను కనిపెట్టిన చైనా నే ఈ
బ్రహ్మాండమైన టీ ని 2700 BC
లో కనిపెట్టింది. చైనా అప్పుడప్పుడు ఇలా
మంచివి కూడా కనిపెడుంది అన్నమాట.
1824లో బర్మా మరియు భారతదేశంలోని
అస్సాం రాష్ట్రం మధ్య సరిహద్దులో ఉన్న
కొండలలో తేయాకు మొక్కలు
కనుగొనబడ్డాయి. బ్రిటిష్ వారు 1836లో
భారతదేశంలోకి తేయాకు సంస్కృతిని
ప్రవేశపెట్టారు. మొదట వారు చైనా నుండి
విత్తనాలను ఉపయోగించారు, కాని
తరువాత అస్సాం మొక్క నుండి
విత్తనాలను ఉపయోగించడం
కొనసాగించారు.
గ్రీన్ టీ ప్రయోజనాలేంటి?
గ్రీన్ టీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ పరగడుపున తాగితే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. గ్రీన్ టీ లో యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి. గ్రీన్ టీ మధుమేహం అదుపులో ఉంచుతుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గిస్తుంది. మెదడు చురుగ్గా ఉండటానికి ఉపయోగ పడుతుంది. క్యాన్సర్ ను రానివ్వకుండా నిరోధిస్తుంది. ఒత్తిడి నుండి ఉపశమనం ఇస్తుంది.
నేను లిప్టన్ కంపెనీ గ్రీన్ టీ ని అరస్పూన్ తీసుకుని, ఒక గ్లాస్ నీళ్ళు ను మరిగించి, స్టౌ ఆఫ్ చేశాక వేస్తాను. 5 నిమిషాల తరువాత వడపోసుకుని తాగుతాను. ఇందులో ఏమి కలపాల్సిన అవసరం లేదు. ఇంట్లో పుదీనా లేదా తులసి ఉంటే రెండు మూడు వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇది మన పొట్ట ను ఫ్లాట్ చేస్తుంది.
బ్లాక్ టీ ప్రత్యేకత:
బ్లాక్ టీ తాగడం అనేది స్ట్రోక్ ప్రమాదాన్ని
తగ్గించడానికి ఒక మార్గం. టీ తాగని
వారితో పోలిస్తే రోజూ కనీసం రెండు
కప్పుల టీ తాగడం వల్ల స్ట్రోక్ ముప్పు
16% తగ్గుతుందని అధ్యయనాలు
చెబుతున్నాయి. బ్లాక్ టీ తాగడం వల్ల
రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది. ఒక కప్పు
బ్లాక్ టీలో 1 క్యాలరీ మాత్రమే ఉంటుంది.
ప్రతి కప్పు బ్లాక్ టీలో 10 నుండి 15 mg
కెఫిన్ ఉంటుంది. కెఫిన్ శరీర శక్తిని
మరియు జీవక్రియ రేటును
పెంచుతుంది. ఇది వ్యాయామం
చేసేటప్పుడు శరీరం మెరుగ్గా
పనిచేయడానికి మరియు వేగంగా బరువు
తగ్గడానికి సహాయపడుతుంది. ఈ బ్లాక్
టీ చర్మాన్ని కాంతవంతంగా చేస్తుంది. జుట్టు
రాలడం తగ్గిస్తుంది.
చాయ్ ప్రేమికులందరినీ పిలుస్తున్నాను,
ఎందుకంటే ఈ చిన్న కథ మీకు
నచ్చుతుంది. నేను టీ ని పొగడాల్సిన
అవసరం లేదు, ఎందుకంటే వేడి మసాలా
చాయ్ ని ఎవరు ఇష్టపడరు?. కానీ గ్రీన్ టీ
ని బ్లాక్ టీ ని కూడా తాగండి. ఆరోగ్యానికి
మంచివి కదా!
Thank you 🙏
✍️ Bhagyamati.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి