ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

AI & CHAT GPT COURSES - ఇంటి నుండే సంపాదించండి.

పరిచయం:

Work from home, online jobs అని గూగుల్ లో సెర్చ్ చేసేవాళ్ల కోసం ఈ బ్లాగ్ రాశాను.

Chat GPT అంటే Chat Generative Pre-Trained Transformer. దీనిని AI రీసెర్చ్ కంపెనీ తయారు చేసింది. ఈ చాట్ జిపిటి  మనుషుల సహజమైన భాషకి సులభంగా స్పందిస్తుంది. అంటే మనం ఏదైనా ఒక ప్రశ్నను అడగడం ద్వారానే సులభంగా కరెక్ట్ అయిన సమాధానాన్ని పొందవచ్చు. 




ఈ చాట్ జిపిటి ద్వారా మనం ఏదైనా ప్రశ్న అని అడిగినప్పుడు ఏ టు జెడ్ సమాచారం అందుతుంది. చాట్ జిపిటి ద్వారా అందే సమాచారము కేవలం ఒకటి రెండు పర్సెంట్ మాత్రమే తప్పుగా ఉంటుంది. వీలైనంతవరకు కరెక్ట్ సమాచారం, తక్కువ సమయంలో గూగుల్ లో వెతకాల్సిన అవసరం లేకుండా సంపాదించవచ్చు. 

AI ఇప్పుడు "బీటా చాట్ జిపిటి" అనే ఒక కొత్త వర్షన్ ని పరిచయం చేసింది. ఇది మరింత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటుంది.

చాట్ జిపిటి ద్వారా మనం సాధారణంగా మాట్లాడే భాషలో ఒక అంశాన్ని చెప్పినప్పుడు, అది డాక్యుమెంట్ రూపంలోనూ... మరియు ఇమేజ్ రూపంలోనూ... కూడా కన్వర్ట్ చేసుకో గలదు.




ఈ చాట్ జిపిటి 

  • కంప్యూటర్ కోడింగ్ ని చదవ గలదు.
  •  మనం చేసే ప్రజెంటేషన్ కి సారాంశం రాయగలదు. 
  • డాక్యుమెంట్స్ ని తయారు చేయగలదు. 
  • మనం రాసే ఆర్టికల్స్ కి టైటిల్ పేరు ని సూచించగలరు. 
  • గణితంలో కష్టమైన లెక్కలకు సమాధానం చెప్పగలదు.



AI అంటే Artificial intelligence.  "Lighthouse Guild Technology Center" అనే సంస్థ ఈ ఏ టెక్నాలజీని కనుగొన్నది.

రాబోయే కాలంలో సాఫ్ట్వేర్ రంగాన్ని మించి ఎక్కువ సంపాదన నిచ్చే చదువులు ఇవి. 


AI టెక్నాలజీని ఉపయోగించి డబ్బు సంపాదించే మార్గాలు:

1. వెబ్సైట్లు డిజైన్ చేయవచ్చు

2. ఆర్టికల్స్ రాయవచ్చు

3. టూల్స్ ను ఉపయోగించి వాణిజ్య ప్రకటనలు చేయవచ్చు. దీనిని డిజిటల్ మార్కెటింగ్ అంటారు.


AI టెక్నాలజీ నైపుణ్యం గల వారికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు:

Glassdoor, Indeed, LinkedIn, Reed, AI Job, Technojobs, and Totaljobs.

 కనీసం డిగ్రీ అర్హత తో పాటు AI technology నేర్చుకున్న వాల్లకి ఈ రంగంలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఏం.బి.ఎ చేసి AI టెక్నాలజీలో స్పెషలైజేషన్ చేసిన వారికి మరియు కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి AI టెక్నాలజీలో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి ఈ రంగంలో త్వరగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది.

AI టెక్నాలజీ ద్వారా వైద్యరంగం లో సులభతరంగా జబ్బులను కనుకోవచ్చు మరియు త్వరగా నయం చేయవచ్చు. కింది లింక్ ద్వారా మరింత సమాచారం పొందండి.

AI APPLICATIONS in HEALTH



Chat GPT కోర్స్ వివరాలు:

Chat GPT కంటెంట్ మరియు మార్కెటింగ్ ప్రయోజనాల కోసం Chat GPT ని ఉపయోగించడానికి తెలుసుకోవలసిన 6 రకాల అంశాలు ఉన్నాయి.  Chat GPT ని మార్కెటింగ్ రంగంలో ఎలా ఉపయోగించాలో basics learning లో నేర్పిస్తారు. కింద ఇచ్చిన లింక్ లో పరిశీలించండి.

Chat GPT basics learning for free


AI కోర్స్ వివరాలు: 

AI టెక్నాలజీ ని ML (మెషీన్ లాంగ్వేజ్) పాటు నేర్పుతారు. కింద లింక్ లో పోస్ట్ గ్రాడయుయేషన్ గురించి తెలుసుకోవచ్చు.

Post graduation in AI & ML


ఇంటి నుండే నేర్చుకోవడం:

Python లో మంచి పట్టు ఉన్నట్లయితే AI టెక్నాలజీ ని ఇంట్లోనే నేర్చుకోవచ్చు.

AI basics learning


ఉద్యోగం - జీతం:

6 Artificial intelligence jobs:

1. Artificial intelligence (AI) engineer

2. Machine learning engineer

3. Data engineer

4. Robotics engineer

5. Software engineer

6. Data scientist.



ఒక AI engineer ki 1year కి ఇండియా లో వచ్చే కనీస జీతం ₹11,79,752 per year. 

ఇంక AI టెక్నాలజీ ద్వారా పొందే ఉద్యోగాల గురించి ఈ క్రింది లింక్ ద్వారా సమాచారం తెలుసుకోండి.

10 highest paying AI jobs

Thank you 🙏.

                                        ✍️Bhagyamati.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్ర...

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ.....

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవి...