బాల్యం - మధురమైన జ్ఞాపకం:
పాఠశాలల్లో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకొనే వాతావరణం ఉండేలా... బాల్యం మధురమైన జ్ఞాపకంగా ఉండాలి. చిన్నప్పుడు మనం స్కూల్స్ లో, ట్యూషన్స్ లో... ఎంతసేపు గడిపిన, రోజులో ఒక పీరియడ్ అయిన పి.ఈ.టి క్లాస్ ఉండేది.
ఒక పీరియడ్ సంగీతం క్లాస్ ఉండేది. ఒక పీరియడ్ కుట్లు, అల్లికలు మరియు డ్రాయింగ్ నేర్పించే క్లాసు ఉండేది. ఇవన్నీ మనలో చదువు పట్ల ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన స్కూల్ వాతావరణాన్ని అందించాయి. చాలామంది మన స్నేహితులు, ఆ క్రియేటివిటీ రంగంలో కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
పాఠశాల చదువులు:
ఇప్పుడు మన పిల్లలు మాత్రం పుస్తకాల బరువు, హోం వర్కులు, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు. స్కూల్స్ లో అన్ని పీరియడ్స్... సబ్జెక్ట్స్ బోధించడానికి సరిపోతుంది. ఆటలాడుకునే పి.ఈ.టి పీరియడ్ లేకపోవడం వలన పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. చిన్నారుల్లో ఆలోచనా శక్తిని, క్రియేటివిటీ ని పెంపొందించే విధంగా పాఠశాల చదువులు ఉండాలి.
జీవితంలో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే తెగువ, తెలివి పిల్లలలో ఉండాలి. ఈ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించడానికి పాఠ్య ప్రణాళిక ఒక సాధనం. తరగతి బోధన కంటే పిల్లలను పని ప్రదేశాలకు, ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళి పరిశీలన ద్వారా అనుభవం పొందే విధంగా బోధన జరగాలి.
కొత్త విద్యా విధానం 2023 (NEP) అంటే ఏమిటి?:
భారత ప్రభుత్వ నూతన విద్యా విధానాన్ని NEP అంటారు. మోడీ ప్రభుత్వం, విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి కొత్త విద్యా విధానం లేదా NEP ని ఆమోదించింది. ఇందులో పాఠశాల నుండి కళాశాల వరకు మరియు ఉద్యోగ అవకాశాల వరకు ప్రతిదీ ఉంది. NEP ని ప్రతిపాదించి, రూపొందించిన వారు ఇస్రో మాజీ చీఫ్ k. కస్తూరి రంగన్. 2022, జూలై లో ఈ NEP ని ఆమోదించారు. ఈ విద్యా విధానం లో...
- కాన్సెప్ట్‌ల అవగాహన కంటే మెమొరైజేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది.
- వృత్తి మరియు అధికారిక విద్య మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ విధానం ఉద్దేశించబడింది.
- మూడు-భాషా ఫార్ములా - పిల్లలు వారి మాతృభాషలో చిన్న విషయం కాని అంశాలను వేగంగా నేర్చుకుంటారు, మరియు గ్రహిస్తారు. ఇంటి భాష, మాతృభాష, స్థానిక భాష లేదా ప్రాంతీయ భాష కనీసం గ్రేడ్ 5 వరకు బోధనా మాధ్యమంగా ఉపయోగించబడుతుంది.
- ఆరవ తరగతిలో ప్రారంభమయ్యే వృత్తి విద్యలో ఇంటర్న్‌షిప్ లు చేర్చబడతాయి.
ముగింపు:
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2023 అనేది అవసరమైన ఒక ముఖ్యమైన సంస్కరణ. భారతదేశం యొక్క విద్యా ప్రమాణాలను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేయాలని, తద్వారా విజ్ఞాన ఆధారిత పరిశ్రమలలో అగ్రగామిగా మారాలని ఈ పాలసీ లక్ష్యం.
ఈ విధానం ప్రజలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, విద్యా ప్రమాణాలను పెంచడం మరియు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దీనిని సాధించడానికి ప్రయత్నిస్తుంది.
కొత్త తరానికి కొత్త చదువులు...భావితరాల భవిష్యత్ ను, గొప్పగా తీర్చిదిద్దాలని ఆశిద్దాం.
Thank you🙏
🔗 Work from home jobs, chat GPT and AI
✍️ Bhagyamati.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి