కలలు నిద్రలో జరిగే మానసిక, భావోద్వేగ లేదా ఇంద్రియ అనుభవాలు. శాస్త్రవేత్తలు నిద్రలో ఉన్నపుడు మెదడులో ఏమి జరుగుతుందో అధ్యయనం చేస్తూనే ఉన్నారు, కానీ మనం ఎందుకు కలలు కంటున్నామో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.
కలలు కనడం ఆరోగ్యకరమైన నిద్రలో భాగం మరియు సాధారణంగా నిద్రపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా పూర్తిగా సాధారణమైన విషయం. ఎక్కువ ఒత్తిడి లేదా ఆందోళనను ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే ఎక్కువగా కలలు కంటాము.
మరణం ఒక భ్రమ, జీవితం ఒక కల మరియు మీరే మీ స్వంత ఊహల సృష్టికర్త. జీవితం అసంపూర్తిగా మారిన సందర్భాలలో ఈ ప్రపంచం సూన్యంగా, అవాస్తవంగా అనిపిస్తుంది. కష్టం వచ్చినపుల్లా సహాయం కోసం ఎదురు చూస్తాం. సహాయం వెంటనే దొరక కుంటే ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు అనుకుంటాం. ఇది మనలో అందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అవకాశముంది. కానీ అన్ని సెట్ అయ్యాక ప్రపంచం వాస్తవికంగా, జీవితం నిజం లా కనిపిస్తుంది.
మనం రాత్రిపూట మంచం మీద నిద్రపోతూ కలలు కంటున్నప్పుడు, మనం మేల్కొనే వరకు ఒక కల నిజమైనదిగా అనిపిస్తుంది. ఈ కలలో దృశ్యాలను చిత్రీకరించేందుకు మనకు కళ్ళు అనే ఇంద్రియాలు అవసరం లేదని మనం అంగీకరించాలి. శరీరం, మనస్సు మరియు మెదడు ఈ కలలో భాగమే.
కొపర్నికస్ అనే శాస్త్రవేత్త, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని భావించినప్పుడు, చుట్టూ ఉన్న మనుషులకు అది తెలియనప్పుడు, అది అతని ఊహ గానో, కల గానో కొట్టిపరేయ వచ్చు. అది నిరూపించడానికి అతను కృషి చేశాడు కనుక అది సిద్ధాంతం అయింది. అలానే జీసస్, బుద్ధుడు, ప్లేటో, షేక్స్‌పియర్, కాంట్ మరియు ప్రసిద్ధ క్వాంటం భౌతిక శాస్త్రవేత్తల ఊహలను కొట్టిపారేయలేము, అవి నిరూపించిన విషయాలు కాబట్టి. అంటే ఊహలు, కలలు కాదు నిజాలు కూడా.
"జీవితం ఒక కల" అనే ఈ మర్మమైన భావన కాలం గడిచే కొద్దీ... వయసు పెరిగే కొద్దీ కలుగుతుంది. ఇలా కలిగిన వారు ఇకపై మరణానికి భయపడరు. వారు శాశ్వతమైన మరియు అపరిమితమైన సంతృప్తి తో జీవిస్తారు. వారు తీవ్ర భావోద్వేగాలలో, ఆలోచనలలో చిక్కుకోరు. ప్రశాంతగా ఉంటారు. వారిని గతంలోని గాయాలు ఇకపై వెంటాడవు. రోజువారీ సంఘటనలు నిర్లిప్తంగా చూస్తూ ఉంటారు. ప్రాపంచిక విముక్తి మరియు ఆనందాన్ని ఆత్మ లోనే అనుభవిస్తారు.
కవి కల్పన:
ఒక కల్పనను సృష్టించడం గురించి చాలా స్పృహ ఉన్న వ్యక్తి, వారి రోజువారి జీవితంలో ప్రజలను పట్టుకునే కథలు, కథనాలను వాస్తవమని నమ్మించ గలుగుతాడు. ఆలోచన, పదాలు, చిత్రాలు మరియు అవి కలిసిపోయే కథ లో చైతన్యం నింపుతాడు. ఒక సినిమా ను తెర పై చూసేప్పుడు... తదేకంగా సినిమాలో పాత్రలా మమేకమై పోతాము. చిత్రం లో నటులు, చిత్రం బయట మనము ఒక ఊహలో 2గంటలు నిలిచి ఉంటాము. ఇది ఒక సాముకిక కల అనుకోవాలి. ఇక్కడ దర్శకుడే కవి. అతను మన మెదడు లో కల ను ప్రేరేపించాడు.
జీవితం ఒక కల, కానీ కల నిజం." జీవితాన్ని వాస్తవికత మరియు కలల యొక్క ఏకకాల స్థితిగా చూడగల సామర్థ్యం మనలో రావడానికి 40 యేళ్లు గడవాలి. మనం జీవిస్తున్న ప్రపంచం లోతుగా వాస్తవమైనది మరియు అవాస్తవమైనది, అదే సమయంలో నిజమైనది మరియు సాపేక్షమైనది.
ఏది ఏమైనప్పటికీ, కలలు కనడం అనేది జ్ఞాపకాలను ఏకీకృతం చేయడంలో మరియు విశ్లేషించడంలో సహాయపడుతుంది. పగటిపూట ఎదురయ్యే వివిధ పరిస్థితులు మరియు సవాళ్లకు "రిహార్సల్"గా ఉపయోగపడుతుంది. జీవితం ఒక కల అయితే భవిషత్తు కోసం బంగారు కలలు కందాం.
Thank you 🙏🏻
✍🏻 Bhagyamati.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి