లేత బెండకాయ లాంటి వేళ్ళను, తరిగి తాలింపు వేసుకోక, కలం పట్టి కాగితం పై ఈ కొట్లాటలెందుకు? కౌగిలించుకుని అరచేతుల్ని కమ్మగా చంపకేసి రుద్దుకోక, ఈ పీకులాట లెందుకు?. పిచ్చి రాతలు రాసుకుని పెద్ద కవినై పోదామనా?! ఈ కాగితాల కట్టలు తీసుకెళ్ళి ఏ మిచ్చరు కొట్టోడికో తాకట్టు పెడదామనా! కాగితమైనా కాకపోయనే, పాత ఫోనులో ఈ పీతాంబరాన్ని ఎవడు చదువుతాడు?! ఇసుకపై అలిగి వెనక్కు వెళ్ళే అల లాగా, విసుగుపుట్టి ముందుకు తోసే సంద్రం లాగా... మధ్యలో ఈ అల కే పట్టింది, లేనిపోని బాధ. ఇష్టపడి ముందుకు సాగదు, కష్టపడి వెనక్కు పోదు, ఏమి ఈ కలం రొధ. పిసినారి సిరా బుడ్డి తప్పా? పిసరంత దైర్యం లేని గుండె తప్పా? చిన్నప్పటినుండి అమ్మ చెబుతోందిగా చందమామ కథలు, మళ్ళీ నువ్వెందుకు మొదలెట్టావు? ఈ కల్లబొల్లి మాటలు. ఒకేమాటను ఒక్కోరకంగా సందుగొందుల్లో తిప్పి మళ్ళీ అక్కడికే తెస్తావు. వచ్చే పోయే దారుల్లో మళ్ళీ కొన్ని ఒత్తులు, పొల్లులు ఏరుకొస్తావు. నీకెందుకు చెప్పు? ఈ దేవులాట. చిమ్మ చీకట్లో నల్లపిల్లికై వెతుకులాట. మాటలన్ని వండి విస్తర్లో వడ్డించుకొని, ముని వేళ్ళతో ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకోక, ఎందుకే 'bhagi' నీకీ భాద. అక్షరం అక్...
Telugu and English writings