మనం చూసే ప్రతిదానిలోనూ అందం ఉంటుంది, కానీ అందరూ దానిని చూడలేరు. అందమంటే ఏమిటో కాదు... కనులకు ఇంపైనది, మనసుకు సొంపైనది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేది. మనసు మరువలేక, మదనపడేది. నా పదహారేళ్ల వయసులో నేను వర్షం గురించి రాసిన మొదటి కవిత... మబ్బు యదను, మెరుపు కొరికి, వానచినుకు వలస పంపె, చిటుకు పటుకు చిన్ని చినుకు, ఆకు చివర పాక వేసే! దప్పికతో పైకి చూసే... పసి మొగ్గల గొంతు తడిపే. మొగ్గ ఒక్క రెక్క తెరచి, ముసిరి ముసిరి నవ్వుచుండ, పరిమళాల కబురు విన్న ప్రియుడు వచ్చే పరుగుపరుగన, వడిన దాచిన వయసునెళ్ళ తాగివెల్లే ఒక్క గుటకన. ప్రకృతిలోని అందం: కవులు ఎప్పుడు ప్రకృతిలోని అందం, స్త్రీ లోని అందం అని మళ్లీ మళ్లీ తిప్పి చెబుతూనే ఉంటాం. అందమంటే మా కథ వస్తువులు ప్రకృతి, స్త్రీ నే. ప్రకృతిలో ఉన్న కొండలు, లోయలు... వాగులు, వంకలు... సెలయేళ్లు, జలపాతాలు... అన్ని ఆమె లో ఉన్నాయి. అందుకే మాకు అందమంటే ప్రకృతి మరియు స్త్రీ. వర్షం పడ్డప్పుడు మట్టి వాసన, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మెరిసే గాజు కిటికీలు, ఆకు చివర మెరిసే మంచు బిందువులు, కమ్ముకున్న ఆకాశంలో మనోహరమైన మబ్బులు, చల్లని గాలి చర్మాన్ని తాకినప్పుడ...
Telugu and English writings