అతని కోసం ఏదో రాయాలని చూస్తున్నాను. నిన్న సాయంత్రం సమీరంలా వచ్చిపోయిన వాడు నేడు వస్తాడా? రాడా? అని ఎదురుచూపులతో ఈ మధ్యాహ్నం నిట్టూర్చి చల్లబడింది.
అతను కొన్ని పుస్తకాల సమూహం. కొన్ని అనుభవాల సమాహారం. ఎంత వింటున్నా ఇంకా ఏదో చెబుతూనే ఉంటాడు. ఆసక్తితో కళ్ళు విప్పారి చూస్తూ ఉంటాను. ఎవరో గొప్ప మహర్షి ఆత్మ కథ వింటున్నట్టు ఉంటుంది. నేర్చుకోదగిన విషయాలు కచ్చితంగా ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలు ఏ పుస్తకాల్లోనూ దొరకవు. అతని మాటలకు కొన్నిసార్లు చిన్నబుచ్చుకున్న, అతని దృష్టితో చూస్తే ఖచ్చితంగా అంగీకరించాల్సిందే!. నిజమేనా? కాదా? అని పదేపదే అడిగి మరీ అంగీకరింప చేస్తాడు.
ఇన్ని మాటలు వింటుంటే నాకు అర్థం కానిది! ఇంతకాలం నేను రాసింది ఏంటి? అని. ఇన్ని సత్యాలను మాట్లాడే నిజాయితీ అందరిలోనూ ఉండదు. అమ్మాయిలు కథల పుస్తకాలు, నవలలు చదివేటప్పుడు అందులోని నాయకుని లక్షణాన్ని చూసి అలాంటి నాయకుడే కావాలని కోరుకుంటారు. నిజ జీవితంలోకి ఆ కథలో నాయకుడే వచ్చి మరిన్ని కథలు చెబుతుంటే!!! ఇతనిలా... ఉంటాడు.
ఇతను గొప్ప రచయిత. ఇతను మాట్లాడే మాటలు, నేను ఏ పుస్తకాల్లోనూ... చూడలేదు. ఏ సినిమాలోను వినలేదు. ఈ రచయితతో అంత స్నేహం చేయగలిగినందుకు నాకు ఎంత గర్వంగా ఉందో!. ఒక అపురూపమైన అనుభవం ఇది. ఇతని గురించి ఒక పుస్తకం రాస్తే అందులో ముందుమాట రాయాలంటే... అతనంతా నిండిపోయిన దైవకణాల గురించి మొదట ప్రస్తావిస్తాను
ఇతను స్వయంగా సంఘసంస్కర్త కాలేకపోయినా... తన అభిప్రాయాలు అచ్చంగా అలానే ఉంటాయి. నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అతని వ్యక్తిత్వం పై నా గౌరవాన్ని మొత్తంగా పెంపొందిస్తుంటాయి. సాంప్రదాయపు ముసుగులో అభ్యుదయ దృక్పథాలని ఎన్నెన్నో చెబుతుంటాడు. నాస్తికత్వంలో ఉంటున్నట్లే కనిపిస్తాడు, ప్రతి మాటను ఆస్తికత్వంలో కనబరుస్తుంటాడు. పేరొందిన నాయకుడిలానే కనిపిస్తాడు, అంతలోనే సర్వం త్యజించిన సాధువులా మాట్లాడుతాడు. అతని వ్యక్తిత్వం, మానవత్వం, నిజాయితీ ఇలాంటి సద్గునాలన్నీ ఆ ముఖంలో ఎప్పుడూ ప్రతిబింబిస్తుంటాయి. రూపంలో చాలా అందగాడు. అంతకుమించి వ్యక్తిత్వంలో బహు ఉన్నతుడు.
ఆయన చదువుతో సంబంధం లేని ఉద్యోగాలు ఎన్నో చేసి సంపాదించిన అనుభవాన్ని అంతా... సామాన్యులకు పంచుతుంటాడు. ఒక మహనీయుడు... నా మిత్రుడు అయినందుకు నా జన్మ తరించిపోయింది. ఒక పెద్ద విషాదంలో కొట్టుకొని పోతున్నాను అనే భ్రమలో బ్రతికే నాకు, అది విషాదమే కాదని తెలియజేసాడు. ఆ విషాదం పుట్టే చోటుని నాకు గుర్తురిగేలా చేశాడు. నాచేత దాన్ని మూలాల నుంచి తొలగించేలా చేశాడు. నాలుగు మంచి మాటలు చెప్పే ఏ పుస్తకాన్ని అయినా ధర పెట్టే కొన్నాను. కానీ "ఇతను" అనే ఈ బతుకు పుస్తకాన్ని మాత్రం దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు. ఈ పుస్తకంలో నా ఆత్మకథను రాసుకోమన్నాడు. మొదటిసారి వారింట్లో స్నేహంతో స్వీకరించిన ఆతిధ్యం, ఈరోజు నా జీవితాన్ని ఇంత అమూల్యంగా మారుస్తుందని ఆ రోజు నాకు తెలియదు.
దేవుడు మన నుండి ఏదైనా సంతోషాన్ని తీసుకున్నాడు అనుకుంటే అది పొరపాటే! అంతకుమించింది ఇవ్వడానికి మాత్రమే మన చేతులు ఖాళీ చేస్తాడు, తిరిగి దోసిలి పట్టనంత అదృష్టాన్ని కుమ్మరిస్తాడు. అదే అతను!.
Thank you 🙏
✍️ Bhagyamati.
Good
రిప్లయితొలగించండిThank you 🙏
తొలగించండి🤝🤝🙏🙏
రిప్లయితొలగించండిజాబ్ కి రిసైన్ చేస్తున్నా అని అన్నట్టు గా.. మీ రచనలకు రిసైన్ చేశారా మేడం..?
రిప్లయితొలగించండి