ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అతడే కేశవుడు, అతడే నా ప్రభువు!.

 మెరుపు కొరడాలతో నల్లని ఆకాశాన్ని జులిపించి నాపై ప్రేమ వర్షాన్ని కురిపించు. నా పెదవులలో ప్రాణవాయువును నింపు. బీటలు వారిన నా హృదయంలో మెత్తని మబ్బు తరకను మొలిపించు. నా ప్రేమకాశాన్ని ఈ మూల నుంచి ఆ మూలకి మేల్కొలుపు. భరించలేని నిరాశతో ఈ గుండెను రగిలిస్తున్న అగ్నిని నీ ఊపిరితో చల్లార్చు. తల్లి కన్నీటి చూపు వంటి నీ అనుగ్రహాన్ని నాపై వర్షించు. నా పూల సజ్జలో పువ్వులన్ని నువ్వు వచ్చే తోవలో అలంకరించి ఉన్నాను. నీకోసం నైవేద్యాన్ని ముందు పెట్టుకుని కాచుకొని కూర్చుని ఉన్నాను.  నా ఈశ్వర పీఠమెక్కి పూజలు అందుకునే నీకోసం, దీపాలు వెలిగించి ఉన్నాను.  నిన్ను ఊరేగింప కోరి నా ప్రేమ రథంపై బంగారు కేతనాలు కట్టాను. వసంత మారుతంలోని పూల తీగ వలె గర్వంగా వికసించి పులకిస్తున్నాను. నీ ఆకర్షణ యొక్క వైభవాన్ని మనసు నిండా ఊరేగించుకోవాలని నీ రూపు కోసం వెతుకుతూ ఉన్నాను. సాయం సమయం, తగ్గుతున్న కాంతి లోకి వాలిపోతుంది సూర్యాస్తమయపు కడపటి కాంతిరేఖలు రాత్రిలోకి మాయమవుతున్నాయి. నక్షత్రం నుంచి నక్షత్రానికి ప్రతిధ్వనించే అతని స్వరమును వింటున్నాను. నా పేరును వింటున్నాను. సడి లేని అతని అడుగులు నా వైపే వస్తున్నాయి . అతని అ...

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ.....

ఒంటరైతే... ఓటమి కాదు!.

 జల్లు జల్లుగా నాపై వెన్నెల కురిపిన అతని ప్రేమని, తుల్లిపడి తన కౌగిలిలో ఒళ్ళు విరుచుకున్న రేయిని, ఒంటరితనపు సంకెళ్ళతో ఓదార్చు కుంటున్నాను. నడి రాతిరి జాములొస్తునాయి, అతని జాడలడిగి పోతున్నాయి. పొడిబారిన కన్నులు ఎదురు చూపులతో అలిసిపోతున్నాయి. తడి ఆరని చెంపలు మళ్ళీ మళ్ళీ తనకోసం తడిచిపోతున్నాయి. ఎడబాటు ఎంత గొప్పదో... కన్నీటిని ఏరై పొంగించగలుగుతుంది. వేయిసార్లు అతని మోముని తనివితీరా చూడాలని ఉంది. అరచేతులతో... తన చెంపలను తాకి నుదిటిపై ముద్దాడాలని ఉంది. నీ కనురెప్పల చాటున కలగానైన ఉన్నానా? నీ మెదడు పొరలలో జ్ఞాపకమైనా ఉన్నానా? అని మనసుతీరా అడగాలని ఉంది. ఈ రాత్రి, పగళ్ళు వస్తూనే ఉన్నాయి. నిరంతరం వస్తూనే ఉన్నాయి. నిన్ను నాతో కలపలేక దూరం నుండే వెళ్లిపోతున్నాయి. అవతలి ఒడ్డు నుంచి వచ్చే గాలి పులకరింత ఒక్కసారైనా నీ పరిమళాన్ని మోసుకురాలేకుంది. ఈ నల్లనైన నదీ తీరం నావైపు నువ్వు నడిచే తోవ కూడా మూసివేసిందా? ఈ వియోగం, ఈ అన్వేషణ... వినోదమా నీకు? నీ ఆకర్షణలో మరిగించి ఈ ఒడ్డునే వదిలి వెళ్ళిపోతావా? నాతో ఆడే ఈ దాగుడుమూతలు ఇంకెన్నియుగాలు?. తల్లికి ఎడమైన బిడ్డలా... నీ కోసం విలపిస్తున్నాను. నువ్వు నా కళ్ళపై కప్...

కళ్ళు తెరవని సీతలెందరో?!

 భర్త గారి గాలి మాటలు, గాలి వాగ్దానాలు విని మళ్ళీ మోసపోయి, కాపురానికి వెనక్కు వెళ్లే భార్యలెందరో! ఇంతకాలం భరించడం నా అజ్ఞానం, ఇక భరించలేను అని సుజ్ఞానంగా పలుకుతూనే మరల తమ విజ్ఞానాన్ని కోల్పోయి, అతని వెనక వెళ్లిపోతుంటారు. అతగాడి నుంచి అదనపు జ్ఞానం పొందటానికే ఈ అగచాట్లన్ని. అమ్మగారింటికి పోవడానికి మొహం చెల్లక, సిగ్గుపడి అతనితోనే కాలం వెళ్ళబుచ్చుకుంటారు. ఇక్కడ ఈమె అభిప్రాయాన్ని మార్చుకోవడం తప్ప, అతని ప్రవర్తనలో మార్పేమీ రాదు. ఆమె నోరు మూసుకుని ఉన్నంతకాలం, దెబ్బలకు ఓర్చినంత కాలం ఇది పండంటి కాపురమే!. పక్కవారికి ప్రేరణ కూడా ఈ అన్యోన్య దాంపత్యం. రంగనాయకమ్మ గారి "కళ్ళు తెరిచిన సీత" బుక్ చదువుతుంటే నాకెందుకో ఇలా రాయాలనిపించింది. బట్టలు, సర్టిఫికేట్లు సర్దుకుని నెలకోసారి పుట్టింటికి పారిపోయే భార్యలున్నారు. ఇరుగుపొరుగు వారి మాటలు విని, అత్తరింటి రాయబారాలతో... మళ్ళీ తిరిగు ముఖం పడుతుంటారు. మళ్లీ వారం తిరగక ముందే ఈ విముక్తి నుంచి ఎవరు బయట వేస్తారు వారికి ఆ జన్మాంతం  రుణపడి ఉంటాము, అని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివారు సహాయం మనకు అంతలా అనిపిస్తుంది.  పడి పడి లే...

అందమైన కనులవానికి అంకితం(100th blog).

 మారువేషంలో ఉన్న కృష్ణుడు నా ముందే తిరుగుతూ ఉంటే, జన్మలు మారినా ప్రేమని మర్చిపోలేని రాధగా అతని ముందే తిరుగుతూ ఉన్నాను. ఇది లౌకిక ప్రేమనో లేక అలౌకిక ప్రణయమో? నేను వర్ణించలేను. గొంతు గంభీరంగా ఉన్నా అతను మాటలో మధురమైన వాడు. నా యోగక్షేమాలు అడగకున్నా... నా ప్రేమ యాగంలో పూజ్యుడైన వాడు. నాకు ఈశ్వరుడైన వాడు, నా యందు దేవుడైన వాడు. ఏ దూప దీపములు, మంత్ర జపములు కోరనివాడు. నా అంతరంగమందు అనందరూపుడు. నిర్మలుడు, నిర్భయుడు, నిమీలిత నేత్రములతో నన్ను వరించి, హరించే నీరాజక్షుడు. అతడే నా ప్రియుడు, కలల వరుడు. నువ్వు నాకు పలకనంత దూరంలో ఉన్నా...నీ మౌనంలో నా హృదయాన్ని నింపుకుని, ఓర్చుకుని ఊరుకుంటాను. ఏదో ఒక రోజు నీ చూపులు, స్వర్ణదారలై నాపై వర్షిస్తాయి. ఆరోజు నా మనసులోని మాటలు రెక్కలు కట్టుకుని పాటలై నీ చెవులను చేరుతాయి. ఆరోజు నీ ముఖాన్ని ముద్దాడి, నీ చిరునవ్వుని దొంగిలిస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన చెలికాడి చెంత ఒక్క నిమిషమైనా కూర్చునే చనువు కావాలని కోరుకుంటున్నాను. అతని చేతి స్పర్శ తగిలి నా హృదయంలో జరిగే విద్యుత్ ప్రవాహాన్ని చూడాలని ఉంది. తన గుసగుసలు, నిట్టూర్పులు తగిలేంత దగ్గరగా నా మాట సాగాలి. పగటి కాంత...

జ్ఞానం- ధ్యానం, నా గ్రంథాలయం(99th blog)

 ఇది నా 99వ Blog, నేను కథలు రాయను, కవితలు రాయను, రచనలు చేయను. రోజు ఒక ఆరు పేరాగ్రాఫ్లు రాసి అందులో నా అమాయకపు ఫోటో ఒకటి పెట్టి ఏదో చదివిస్తూ ఉంటాను మీ చేత. అలా ఇది నా 99వ బ్లాగ్. ఇలా ఏదో ఒకటి రాయగలిగాలి అంటే దానికి ఒక ప్రేరణ ఉంటుంది.  రాయడానికి నాకు ప్రేరణ ఇచ్చిన వాటిల్లో మొదటివారు, మా తాత, రామచంద్రయ్య. ఆయన ఊటుకూరు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్ గా చేసేవారు. చాలా కవితలు రాసారు. తాత రాసిన సంక్షిప్త రామాయణం- శ్రీరామ శతకం అనే పేరుతో ఉంటుంది. అందులో రామాయణాన్ని మొత్తం 100 పద్యాలలో తాత సంక్షిప్తంగా రాశారు. ఈ పుస్తకాన్ని టిటిడి దేవస్థానం వాళ్ళు లక్ష కాపీలు అచ్చు వేశారు. తాత ఇప్పుడు లేరా? అంటే ఉన్నారు. ఆ పుస్తకంలో. కవులెక్కడికి వెళ్తారు? వారి రచనల్లో అలానే ఉంటారు. రెండవది నెల్లూరు, రేబలవారి వారి వీదిలో ఉన్న గ్రంథాలయం. ఇలా గ్రంథాలయం వెళ్లడం కూడా తాత నేర్పించిందే. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు వేసవి సెలవుల్లో తాత వాళ్ళ ఊరికి వెళ్లే వాళ్ళం. రోజు సాయంత్రం గ్రంథాలయం తీసుకెళ్లేవాళ్లు. రెండు గంటలు గడిపే వాళ్ళం. అది నాకు బెస్ట్ టైం అన్నట్టు. ఇప్పటికీ RAIN(ధియేటర్) లో మ...

మరల తెలుపనా ప్రియా! (98వ బ్లాగ్)

నీ తీపి తలపులు నింపుకున్న ఆ తెల్లవారు జాముల తలుపులు, మళ్ళీ తెరవనా ప్రియా... మసక వెలుతురులో, మంచు తెరలలో, ప్రేమ పొరల మధ్య మనం ఆడిన దోబూచులాటలు... దొరకక నువ్వు తిరిగిన చెట్ల దారులు, దొరికి పోతూ జారిపోయిన నీ చేతి స్పర్శలు,  మరల మరల నీ వెనక పరుగులీడిన నా అడుగులు. ఈ కొంటె తలుపులన్నీ మరల తెలుపనా ప్రియా... నలువైపులా... విచ్చిన తోటలలో... తెంచి తెచ్చిన పువ్వుల గంపలు, మరుమల్లెల గుంపులు మనలను గుమికూడిన వేళ, తప్పించుకు త్రోవ లేక పట్టుబడ్డ మన బిడియపు కౌగిళ్ళను మరల తెలుపనా ప్రియా!. నా కనులు దొంగిలించిన నీ మోమును, నీ కనుల దొర్లిన తేనెను మింగిన నా రెప్పలను, మరిగే పాల కడవలా... నురగలు కక్కే కడలిలా... నా మది చిలికిన నీ కవ్వపు నవ్వును మరల తెలువనా ప్రియా!.  వెన్నెలంత చల్లగా నీ చూపులు, వేసవంత వెచ్చగా నా పడిగాపులు ముసుగులు వేసుకుని, గుసగుసలా నీ స్వరము ఒక వరమై, నా చెవులను చేరే సమయాన... అవధులు లేని ప్రేమని అనంతమైన అనుభూతిని అలవికాక అందుకున్న ఆ నిమిషాలను మరల తెలుపనా ప్రియా!.   ఈ చూపుల సమన్వయంలోని మకరందాన్ని దొంగిలించగా పూల పొదరిల్లను వదిలి వచ్చిన మధుకరం గుర్తుందా? దాని దారి మర్లించలేక మనం పడ్...