నీ తీపి తలపులు నింపుకున్న ఆ తెల్లవారు జాముల తలుపులు, మళ్ళీ తెరవనా ప్రియా... మసక వెలుతురులో, మంచు తెరలలో, ప్రేమ పొరల మధ్య మనం ఆడిన దోబూచులాటలు... దొరకక నువ్వు తిరిగిన చెట్ల దారులు, దొరికి పోతూ జారిపోయిన నీ చేతి స్పర్శలు, మరల మరల నీ వెనక పరుగులీడిన నా అడుగులు. ఈ కొంటె తలుపులన్నీ మరల తెలుపనా ప్రియా... నలువైపులా... విచ్చిన తోటలలో... తెంచి తెచ్చిన పువ్వుల గంపలు, మరుమల్లెల గుంపులు మనలను గుమికూడిన వేళ, తప్పించుకు త్రోవ లేక పట్టుబడ్డ మన బిడియపు కౌగిళ్ళను మరల తెలుపనా ప్రియా!. నా కనులు దొంగిలించిన నీ మోమును, నీ కనుల దొర్లిన తేనెను మింగిన నా రెప్పలను, మరిగే పాల కడవలా... నురగలు కక్కే కడలిలా... నా మది చిలికిన నీ కవ్వపు నవ్వును మరల తెలువనా ప్రియా!. వెన్నెలంత చల్లగా నీ చూపులు, వేసవంత వెచ్చగా నా పడిగాపులు ముసుగులు వేసుకుని, గుసగుసలా నీ స్వరము ఒక వరమై, నా చెవులను చేరే సమయాన... అవధులు లేని ప్రేమని అనంతమైన అనుభూతిని అలవికాక అందుకున్న ఆ నిమిషాలను మరల తెలుపనా ప్రియా!. ఈ చూపుల సమన్వయంలోని మకరందాన్ని దొంగిలించగా పూల పొదరిల్లను వదిలి వచ్చిన మధుకరం గుర్తుందా? దాని దారి మర్లించలేక మనం పడ్...
Telugu and English writings