ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నిండు చంద్రుని జాడ లేదు?

  పుడమిపై లేడు కానీ... పున్నమి వెన్నెలలో వెతికాను. తన జాడ లేని ఈ పున్నమి ఎక్కడిది?? ఈ తెల్లని వెన్నెల ఎక్కడిది?? నింగికెగరి వెతకాను, మబ్బులను పక్కకు తోసి చూసాను. మంచు కొండలపై కలిసిపోయాడని మరీ మరీ వెతికాను. అలిగి నాపై దాక్కున్నాడని, అందరాని చందమామ కోసం జగమంతా... వెతికాను. ఆకాశానికి నిచ్చెనేయగలనా... ఆ అల్లరి చూపుల వానిని పట్టుకోగలనా?? ఆ ముద్దు పెదవుల అందం, ముత్యాలు నిండిన బుగ్గ సొట్టల చందం... ఇక ఎక్కడైనా చూడగలనా?!. "అమ్మ" అని ఆశ తీర పిలవాలని ఉంది. ఒక్కసారైనా దరికి చేరి చూడాలని ఉంది. చిన్ననాటి అమ్మ ప్రేమ ముద్ద, ఈ చందమామను చూసే తిన్నాను, ఇతను నింగి నలిగి నేలకొచ్చాడా? నేలపై అలిగి నింగికెళ్లాడా? ఎప్పుడొచ్చాడో... ఎప్పుడెల్లాడో... అర్థవసంతమైనా కాలేదు, అందాల చంద్రుని ఆచూకీ లేదు. తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ తెల్లని చంద్రుని తేట తెల్లం కాని ఈ జాడలను. బ్రతుకు సఫలమయ్యే రోజు వరకు నిశబ్దపు కాలంతో... నిట్టూర్పుల యుద్ధం చేశాను. గుండె శబ్దమొక ప్రేమ మంత్రమై, జపించి, అతనికై తపించి తన మనసు వాకిట ప్రేమ వర్షమై కురిసాను. ప్రేమ పడవను కట్టి, పల్లానికి కొట్టుకుని పోతున్నాను. గట్టిగా రాయేదో... తగిలి ఆగి...

గాలులు ఎందుకు గంధము చిలికే...

పున్నాగ పూవుల నీడలలోన...  అందాల గంధపు గాలులు వీచే!  చిన్నారి మనసును తెచ్చి, శ్రీరంగనాథునికిచ్చి,  మందార పూవులా... ఎర్రగ కంది,  ఇన్నేళ్ల ప్రేమను చిలకలు చుట్టి,  తన బంగారు వేళ్లకు బహుమతి నిచ్చి, గులాబీ మొగ్గల పెదవుల మధ్య మాటల వీణల పాటలు పాడగా... వయ్యారి కన్నులు వాలుగ చూడగా,  వందేళ్ల పండుగ...నీవే నిండుగా. మరుమల్లే పూవుల యుద్దమో, కస్తూరి జింకల స్వేదమో, ఏ మలయ పర్వత మారుతమో... ఏ చందన పరిమళ ప్రళయమో ... నన్నెత్తుకెళ్లెను నింగిలోకి. ఈ మత్తు గాలిలో గువ్వగ ఎగిరి, నా రెక్కల ఊయల కట్టి, నిన్నేగరేసుకుపోనా... చుక్కల పక్కకు తీసుకుపోయి చంద్రునితో తులతూయనా... నీ కన్నుల అందము, ఏ వెన్నెలకీ...రాదని చాటి నీ రాధని, నా ప్రేమ గాధని, ఆ నింగిపైన రాసిరానా!. అందాల భరిణవు నీవని, వందేళ్ల ఆయువు ఇమ్మని, శ్రీరంగనాథుని కోరి... చామంతి పూవుల మాలను కట్టి, నా బంగారు స్వామి మెడ వంపులపై శృంగార మంత్రము జపియిస్తూ... గాలుల్లో ప్రేమ గంధము జల్లనా! ఏ పూవుల ఒడిలో సుగంధమో, ఏ తుమ్మెద రెక్కలు తెచ్చెనో... నా మనసు తాకిన క్షణమున, ఈ కవితల రూపము మారెను. ఏ గాలి చెప్పిన సందేశమో... అంతర్జాలపు ఇంద్రజాలమో... నే ప్రేమ ...

నీటిపై రాతలు

చెరిగిపోయే జ్ఞాపకాల్ని చెదిరిపొనీకుండా... చేతులలో పట్టుకుని పుస్తకమంతా అలుముకున్న ప్రేమ కావ్యం ఇది. ఇది నాపై నాకున్న ప్రేమో... అవతలవారిపై పెంచుకున్న ప్రేమో... పొడిబారిన మనసులో... కన్నీటితో తడిచిన తలపులను మళ్ళీ మళ్ళీ వల్లె వేసుకుంటూ... రాసుకున్నాను. ఇవి ఒక రాయి రాసుకున్న రాతలు... రాయి నుదిటిపై చెదిరిన గీతలు...  నా మాటలను ఆపేసి ఆ సముద్రం వైపే చూస్తున్నాను, అందులో నాకు గోచరించని రహస్యమేదయినా ఉందని. అది నా వర్తమానాన్ని శాసిస్తూ, భవిష్యత్తును బోధిస్తూ ఉందని!. నా బాధ లోతు, ఈ సముద్రపు లోతుకేమీ... తక్కువ కాదు. అట్టడుగులో రత్నగర్భ మున్నట్లు, నా గుండెలోనూ... ఓ గుడి దర్శనమిచ్చింది. మనుషుల్లో దేవుణ్ణి చూస్తూ... వెంబడిస్తున్నాను. దేవుడు దొరికే వరకు వెంబడిస్తాను. గుండె లోతుల్లోంచి వచ్చే గురుతుల్ని, ఎండుటాకుల్లా... రాలిపోయే ప్రేమ లేఖలని, అన్నింటినీ ఆత్మ కేసి కుట్టుకుని, వాస్తవానికి దూరంగా... గతంలోనే మిగిలిపోయిన నా గొంతును సరిచేసుకుని కొత్త పాటలు పాడటానికి తయారవుతున్నాను. ఏ పల్లవి నన్ను పల్లానికి చేరుస్తుందో? ఏ చరణం నాకు చరమగీతం పాడుతుందో? ఏ పాట నా నోట ప్రాణధారగా నిండుతుందో? నాకే తెలియని సందిగ్ధంల...

నకిలీ నవ్వు

 పగలంతా పరుగులు తీసి తాపత్రయపడ్డ మనసు సాయంత్రం కుదుట పడకుంది. రాత్రి జోల పాడి ప్రేమగా లాలించే ఒడి కరువైంది. ఈ మనసు పూర్వ చరిత్ర ఏమిటని దీని ఆచూకీ కనిపెడదామని బయలుదేరాను. చూసిన వాళ్లకి మరోలా అర్థమవుతుంది ఈ నవ్వు, కానీ ఆమె అంతరంగం ఏంటో ఆమెకే తెలుసు.  నేను అసలు లేనట్టే ఉన్నానా? నన్ను నేనే క్షమించుకొని బ్రతుకుతున్నానా? అద్దంలో నా చూపు నుండి నేనే తప్పించుకు తిరుగుతున్నానా? ఎన్నో కథలను చెప్పే నా కనులు, ఎంతో రాసిన నా చేతులు... ప్రేమ ముందు చులకన అయ్యాయా? చనువిచ్చి హృదయం, గతిలేక పడి ఉందా? బహు చచ్చుగా ఈడుస్తూ జీవితం సాగుతోందా?  జీవితపు వంకరదారుల్లో... పక్కుమని నవ్విన నా నవ్వుల శబ్దం ఇంకా వినబడుతూనే ఉంది. అయినా ఈ నవ్వులో మనసుకు సౌఖ్యం ఉందా? కొండల్లో ప్రతిధ్వనించే సంగీతంలా... మాటిమాటికి నా మాటలే చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అమృత వాక్కులు కాదవి, ఆటవిక అంధకారంలో నలిగిపోయిన అర్ధంలేని ప్రశ్నలు. తలుచుకుంటే ఒళ్ళు జల్లుమనే మాటలు. ఆ ప్రశ్నల మధ్య నమ్రతగా నలిగిపోయిన అనుభవశాలిని నేను. ఇంకా ఇన్నేళ్ల తరువాత కూడా జీవితంలో ఆశ కోసం వెతుకుతూ ముందుకు సాగుతున్నాను. నా ఆత్మగౌరవం కోసం తపన పడటం ఇప్పుడు నా...

Cats and Women

I want to write that' why should women like cats more than man do? Nothing is a big point here women pay more attention than man. This is the actual favourite point to interact with cats. In my previous blogs also I have mentioned that, my childhood days were all gone and grown with cats. Now I have 3 cats with me. Lucy, Bussi and Ronaldo.  Beauty of cats They have wide ears, soft and sensitive skin, leight weight bodies. That bright eyes which shows us so many shades. When they frightened by other cats, just shows that aggressiveness in their eyes is so beautiful.  Cats are always like to play with their own tails as toys. May they know or not? This tail is her own! Surprisingly chasing the tail and rounding around.  Cats give liveliness  While we will show her in a mirror, she can scratch on... Feel aggressive'. Oops, they frightened to their own face. Such a cute innocent cats are living in this wild world. Some times, I feel that boring days, inobjective mistakes...

I paint myself as a Saint

  MYSELF:  'Bhagyamati', it's my pen name. I love to introduce myself as Bhagyamati, more than my true name. I'm nothing in my past, now I'm a blogger, since my age of 13, I'm a writer, still I'm a blogger just the term was changed. I'm much inspired by Jay Shetty 's book, THINK LIKE A MONK.  Here the author told that " Train your mind for peace and purpose every day". I'm truly following this principle.  EARLY MORNINGS: Actually I'm not a morning person. So many of my friends studying in complete nights(night outs) in semister exams... University days. But I didn't. Sleep is enough to me. Ofcourse i wrote well, got good marks 😅. About 2 years ago, I was greatly inspired by a book " 5AM CLUB". ROBIN SHARMA is the author. Actually I listen it as audio book, will give you the link below. 5AM Club audiobook Wakening by 5AM and going by walk alone is a wonderful thing. There is no traffic, no people, no busy schedules. On...

చుక్కల్లో చందమామ నీవేనా!.

 దివ్వెలా... వెండి పువ్వులా... ఆకాశంలో విరబూసిన చందమామ. చట్టా పట్టాలేసుకుని చుట్టూ మూగిన చుక్కలు. నిశ్చలంగా... నిర్మలంగా... కనుబొమ్మ  పైకెత్తి చూసే చందమామ, తన చూపు తట్టుకోలేక, కొంగు పట్టుకుని పది గజాల దూరం పరిగెత్తిన కొన్ని నక్షత్ర భామలు. తలుకుతో... తమ కులుకుతో... చంద్రున్నే చూసే మరి కొన్ని భామలు. తమ వంక ఓరగా చూసే కనులకు బదులుగా... చూపులకు చుపులిచ్చి, చిరునవ్వులతో హృదయాన్ని మండించుకున్న కొన్ని భామలు. సుగుణాల చంద్రుణ్ణి భక్తితో చూస్తూ... ఆ చూపే అదృష్టంగా భావించే కొన్ని చుక్కలు. చీకట్లో చప్పున దీపాలు వెలిగినట్టు మెరిసి ఆరే కొన్ని బిడియపు తారలు. తదేక దీక్షతో చంద్రున్నే చూసే ఇంకొన్ని వగలమారి తారలు. తారలెన్ని రంగులైనా, అవి చుట్టుముట్టిన చంద్రుని వల్లే వాటి రూపురేఖలు. పుడమి నిండా పూవుల వాసన, సెలయేటి నీళ్లలో సన్నాయి మేలము, రోజూ చూసే ఆకాశంలో నూతనత్వము, ఎవ్వనము, కొత్త సౌదర్యపు సోయగము. అన్నీ అద్భుతాలే నేడు ఆకాశంలో... కళ్ళు నులుముకుంటూ చూస్తున్నాను. ఈ చుక్కలకేమి కొత్త రోగము, నిన్నటిలా లేవు మరి. కొత్త పెళ్ళికూతురిలా... నడుమూపుతూ, నవ్వు దాచుకుంటూ ఓరకంట చంద్రునిపై కోరికల బాణాలేస్తునాయి. తమ ...