ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

గిడుగు- తెలుగు పిడుగు, Telugu literature

             వ్యవహారిక భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు... సవర గిరిజనుల అభ్యుదయకారుడు "గిడుగు రామ్మూర్తి."                                            ✍️ Bhagyamati  ఈయన 'హేతువాది' అంటే ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా కారణాలను అన్వేషించేవాడు.      ఎక్కడో ఊరి చివరన ఉన్న గిరిజనులు 'savara' జాతి వారి కోసం ఊరిలో నుండి ఉద్యమించాడు. అడవి తప్ప ఊరు తెలియని వారికి ఊతమిచ్చాడు... రాత నేర్పాడు.      మన భాష నేర్పాలంటే ముందుగా వారి భాష నేర్చుకున్నాడు. వారి విద్యాభివృద్ధికి కృషి చేశాడు. తన సొంత డబ్బుతో సవర భాషలో పుస్తకాలు రచించి,  ప్రచురించాడు. సవరజాతీయుల కోసం పాఠశాలను కూడా స్థాపించాడు. ఈయన కృషి ముందు ప్రభుత్వం ఇచ్చిన బంగారు పథకాలు 'రావు బహదూర్' బిరుదులు చిన్నబోతాయి.  "సామాన్యులు తమకోసం, తమ కుటుంబం కోసం శ్రమిస్తారు. అసామాన్యులు ఇతరుల కోసం శ్రమిస్తారు." ఒక జాతి కోసమే కాదు...

జననమా - మరణమా! - M.S. Swaminathan and Bagath singh

                                        Bhagyamati✍️   హరిత విప్లవ పితామహుడు, భారతరత్న గ్రహీత, భారతదేశపు ఆధునిక వ్యవసాయ అభివృద్ధి విధాన రూపకర్త...  ఎం.ఎస్ స్వామినాథన్ ఈ రోజు మరణించారు.    నేడు ప్రపంచంలో గోధుమ పంటను ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉంది. 1960 లలో ఇదే భారతదేశం గోధుమలను, అమెరికా నుండి దిగుమతి చేసుకునేది అంటే నమ్మడం కష్టమే. గోధుమలను దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయి వరకు తీసుకురావడానికి కృషి చేసిన వారు స్వామినాథన్. ఈయన హరిత విప్లవం ద్వారా మనదేశంలో  కొత్తరకం గోధుమ మరియు వరి వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, బాజ్రా పంటల ఉత్పత్తిని తారాస్థాయిలో పెంచగలిగారు. అందుకే ఇది హరిత విప్లవం కాదు వ్యవసాయ విప్లవం అంటారు.      1966లో ప్రారంభించిన ఈ హరిత విప్లవ ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిని 81 మిలియన్ టన్నుల నుంచి ఇప్పటికీ 300 మిలియన్ టన్నులకు పెంచిందంటే ఆశ్చర్యమే. భారతదేశంలో జీవనోపాధిగా ఉన్న వ్యవసా...

సింధు నాగరికత మిగిల్చిన తీపి గుర్తులు

                                          Bhagyamati ✍️                                        Anil సౌజన్యంతో...     సింధూ ప్రజలు పండించిన గోధుమ, బార్లీ, వరి తదితర పంటలు ఇప్పటికీ... మన వ్యవసాయ రంగంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.      వారు పూజించిన స్త్రీ దేవతలు 'ఆదిశక్తి' గా... పశుపతిని 'శివుని'గా... వృషభాన్ని 'నంది'గా... ఆరాధిస్తూనే ఉన్నాము. 'లింగ పూజ', 'అమ్మ తల్లి'  ఆరాధన, శక్తి ఆరాధన, నాగపూజ, రావిచెట్టు పూజ... ఈనాటికీ భారతీయ సమాజం పై ప్రభావాన్ని చూపుతున్నాయి. అప్పటికి, ఇప్పటికీ...పూజించే పద్ధతులు మారాయే తప్ప, ఆరాధించే దైవాలు మాత్రం మారలేదు.     హిందీ లో 'మొహెంజొధారో ' సినిమా ని చూస్తే... సింధూ నాగరికత కళ్ళ ముందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. గ్రీకు శిల్పంలా... హృతిక్ రోషన్, అందమైన దేవతలా... పూజా హెగ్డే, కనులకు ఇంపుగా ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఆ స...

శ్రమజీవులు - కులవృత్తులు - Villages in India

                                              మాది "చాటగొట్ల" గ్రామం. ఇది పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లాలో ఉంది. మా గ్రామంలో ప్రజలు వ్యవసాయము, నిమ్మ తోటలు సాగు చేయడం ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తరువాత ప్రధాన వృత్తిగా పాడి పరిశ్రమ ఉంది.     ఇక్కడ చాలామందికి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కోళ్లు ఉన్నాయి. ఊరు చుట్టూతా మంచి పచ్చిక బయళ్లు, తోటలు, అడవులు మా ఊరికి అందాన్నిస్తుంటాయి. ఈ పచ్చిక బయళ్ళలో పుష్కలంగా గడ్డి లభించడం వలన పాడి పశువులు చక్కగా... శక్తివంతమైన, ఆరోగ్యకరమైన పాలు ఇచ్చుచున్నాయి.     ఇచ్చట యాదవులు... పశువులను, ఆహారం కోసం... త్రోలుకొని పోవుచూ... వాటికి కావలసిన పెద్ద మొత్తంలో నీరు మరియు దాన్యపు పిండిని సమకర్చుచూ... వాటి ద్వారా వచ్చే పాలను అమ్ముచూ... జీవనోపాధిని గడుపుతున్నారు.    వేకువ పొడిచినప్పటి నుండి, ఈ గేదెలకు నీరు ఆహారం అందించడంతో వీరి రోజు మొదలవుతుంది. ఈ మూగ జీవులను ఆహారం కోసం అడవికి తోలుచూ... మరలా ...

అమ్మ లాలి - చారు కోసం

   My daughter name is charumati  నిన్ను కన్నతల్లి నే...ను,  ముద్దులొలికే పా...ప నీవు. నిన్ను కన్న తల్లి నే...ను.  ముద్దులొలికే పా...ప నీవు.  బుజ్జగించు వేళలోన  బుద్ధిగుండు నా తల్లి.  ఇంత చిన్న వయసులో...  అంత అల్లరేల నీకు, ఇంత చిన్న వయసులో... అంత అల్లరే...ల నీకు... పంతమేల చేశావూ .... పండుకోవె నా తల్లి. వెచ్చనైన అమ్మ ఒడిలో.... స్వచ్ఛమైన ప్రేమ ఉంది.  వెచ్చనైన అమ్మ ఒడిలో... స్వచ్ఛమైన ప్రేమ ఉంది. ఆశ తీర ఆటలాడి, అలుపుదీర  నిధురోవే! నిన్ను కన్న తల్లి నే...ను,  ముద్దులొలికె పాప నీ...వు. బుజ్జగించు వేళ లోనా... బుద్ధి గుండు నా తల్లి. బుజ్జగించు వేళ లోనా... భుద్దిగుండు నా తల్లి. Thank you ☺️ ✍️Bhagyamati.

అతనే నా ప్రేమ...

              మౌనమేలనోయి                                          పరి పరి విధముల కదిపిన, పలుకవు,  ఉలుకవు. పదములు పాటగా కూర్చిన, చేర్చిన, పెదవిని విప్పవు, బదులును చెప్పవు. ఎదలో మాటను ఎదురుగా చెప్పిన,  ఎర్రని కన్నులు ఎదుటగా నిలిచిన, ఎందులకడగవు, ఏమని పలుకవు. ఎగిరే పిట్టగ రెక్కలు కట్టుకు కాలిని మొక్కిన దిక్కును చూపవు అక్కున చేరవు.  పక్కన నవ్విన వెక్కిగా ఏడ్చిన నీకని కానవు. నాలో చేరవు. దిక్కులు తెలియని చుక్కను నేనై చెక్కిలి చేరిన, పక్కున నవ్వవు, కౌగిలినివ్వవు. అందం నా ప్రేమ బంధం అందానికి అందని అందమది. అతిశయమన్నను చందదది.  అద్భుతమే తన సరి అన్నది. అందరికందని అందమది. చెందిన కొందరు పొందిన కనువిందు అది. గంధపు సంద్రము అందెలతాకిన ఆనందమది. బందిగ నాకు పందిరి మంచపు బంధము అయినది. తొలిప్రేమ హృదయాంతర మందిరమందున,  నిదురించిన ఆశను లేపి,  పెదవందిన భాసల తోడ పలికా ఒక పల్లవిగా...  తడి ఆరిన పెదవుల పైన అదరామృత మందివ్వమని, అధరాదర కౌగిలి యందు...

Who is OSHO?

                           From 1980's a famous spiritual Guru known as 'Osho',  also known as Bhagwan Shri Osho. His commune in Oregon known as  Rajnish Puram. There in 80's... so many 'Bollywood film actors' are inspired by Osho teachings and sought spiritual enlightment.       'Osho' has read about 2 lakhs books in his life means 7000 books for year. is it possible?! hope so... He also wrote more than 200 books like 'Osho gen tarot',  'sambhog se samadhi ki or', yoga etc. These books are available in Amazon Flipkart. We can found 'Osho online library-The books' from 'osho.com'.       'Osho' is a book lover, person from Mysore. His followers celebrates his birthday on December 11th every year. he is a Indian spiritual reader, wrote many spiritual and life changing books. he has taken themes like meditation, love, mindfulness, intimacy, freedom, sex, aloneness... in h...

రక్తహీనతను అధిగమించడం ఎలా

        ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో 60% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.  దీనికి కారణం ఆహారంలో ఐరన్ లోపం, పౌష్టికాహార లోపం. దీనిని అధిగమించాలంటే విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను, పచ్చి కూరగాయలను, పండ్లను తీసుకోవాలి. క్యారెట్లు మరియు బీట్రూట్లు పచ్చగా తినడం ద్వారా లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల రక్తహీనతను అధిగమించవచ్చు. బీట్రూట్ జ్యూస్ ను సేవించటానికి చాలామందికి ఉన్న అభ్యంతరం ఏమిటంటే బీట్రూట్ జ్యూస్ వగరుగా అనిపించడం, దాని పచ్చివాసన నచ్చకపోవడం. అందుకని బీట్రూట్ ని రుచికరంగా మనకు నచ్చే విధంగా జ్యూస్ చేసుకోవడం ఎలాగో చెబుతాను. ఇందుకు కావాల్సిన పదార్థాలు-  బీట్రూట్ 1, టమోటాలు 2,  అల్లం హాఫ్ ఇంచ్,  1 స్పూన్ తేనె.          టమోటాలను, బీట్రూట్ ను కట్ చేసి అల్లం ను జోడించి మిక్సీకి వేసి ఫిల్టర్ చేసుకొని అందులో మనం ఒక కప్పు నీటిని జత చేస్తాం. పడపోసిన తర్వాత ఇందులో ఒక స్పూను తేనె ను కలుపుకుని సేవించాలి.  ఇలా రోజు చేసినట్లయితే నెల రోజులు తర్వాత మనకి హిమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాల సంఖ్య బాగా పెరుగుతుంది.

నేనొక ప్రేమ వనం - Telugu love poetry

   ఓ ప్రేమ! నీకొకమారు ఒక కమ్మని కవితను చెప్పాను. నీ కన్నుల కాచే వెన్నెల చంద్రుడు నేనని చెప్పాను. ఆ పున్నమిలోన పూసిన కలువలు నా నవ్వని చెప్పాను. ఆ నవ్వున రాలిన రతనాల రంగువు, నువ్వని చెప్పాను. రంగు రంగుల ఈ లోకం రమ్యమైనది అయితే...  నా అంతరంగమందున్న నీవు ఏ రంగని చెప్పాలి?! కృష్ణుని నీలి వర్ణమా... సాయంకాలపు మేఘ వర్ణమా... లేత పూవుల పసిడివర్ణమా...  పూతరేకుల శ్వేత వర్ణమా... రాత రాతలో నీపై ప్రీతి చెప్పగలను తప్ప,  నా గుండె లోతులో నీకై పడే వ్యధను చెప్పగలనా... రొధను చెప్పగలనా... ఏటి గట్టున ఎంకిలాగా... ఏళ్ల తరబడి పాడుతున్నా! నీటిజల్లు కనుల వెంట ఏరులై పారుతున్నా! నీ చెవిన పడ్డ జాడలేదు, నీకై పరుగులీడే నా అడుగులు తప్ప. తప్పొప్పుల తడికలు పక్కకు తీసి, కప్పిన రెప్పల చాటున కనుపాపలు విప్పి చూడు. గుప్పున వచ్చే ప్రేమ పరిమళాలు. చెప్పక చెప్పే నా మౌనం... నీ మెప్పుకు వేచేదే తప్ప, నిన్ను నొప్పించేటిది కాదు ప్రియ! Thank you 🙏🏻    ✍️Bhagyamati. 🔗  Beautiful India

Krishna - Udhav, క్రిష్ణుడు - కుచేలుడు

      ఒకరోజు యమధర్మరాజు హుటాహుటిన తన అకౌంటు పుస్తకాలు అన్ని తీసుకొని ద్వారక బయలుదేరాడట.  ఎందుకంటే? కృష్ణునికి తన పుస్తకంలోని నియమ నిబంధనల గురించి వివరించి చెబుదామని. కృష్ణ భగవానునితో ఇలా అన్నాడట పరమాత్ముడైన కృష్ణుడు, నేరాలను క్షమిస్తూ పోతూ ఉంటే, ఇక పాపులెవరు ఉంటారు? నాకు యమపురిలో స్థానం ఎక్కడిది? కనుక ఈ అకౌంట్ పుస్తకాలన్నీ మీ వద్దనే ఉంచండి, ఇందులో ఈ భూమిపై జీవించే అన్ని రకాల జీవరాశుల కర్మలు, కర్మ ఫలాలు రాయబడ్డాయి, ఇది మీతోనే ఉంచండి., అని నిష్టూరంగా అన్నాడట.       తన అందమైన చిరునవ్వుతో 'కన్నయ్య'., యమధర్మ రాజా! నీ బాధకు కారణం ఏమిటో చెప్పవయ్యా? అన్నాడట. కృష్ణా!  పేదవాడు ఆకలి కోసం తప్పులు చేయాలి, ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి చనిపోయాక, మా యమపురికి రావాలి. అటువంటిది భగవంతుడైన నీవు ఈ నియమ నిబంధనలకు విరుద్ధంగా పాపులందరినీ క్షమిస్తూ పోతూ ఉంటే, అందరూ నీ వైకుంఠం పోయే వారే తప్ప నా యమపురికి వచ్చేవారు ఎవరు స్వామి? అన్నాడట!.        పేద బ్రాహ్మణుడైన 'సుధామ' కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. కడు పేదరికంతో జీవనం సాగించలేక,  తన భార్య సలహా మేరకు ...

భూమి మానవులకు చెందదు; మానవులు భూమికి చెందినవారు - Human and Earth

                                   భూమి పుట్టుక - Birth of Earth:-              మానవుడు అనే మాట పుట్టక ముందే భూమి పుట్టింది. మానవుని ఉనికిని తెలుసుకోవడానికి డార్విన్, అరిస్టాటిల్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎందరో ఉన్నారు.  మానవుని పుట్టుక, ఉనికి,  మనుగడ, అభివృద్ధి... ఇవన్నీ మానవ సమాజం అనే పదం లోనివే. ఇవన్నీ అర్థం కావాలంటే అంతకంటే ముందు నుండి ఉన్న భూమి గురించి తెలుసుకోవాలి.             భూమి గురించి చెప్పాలంటే ఒక ఖగోళ శాస్త్రవేత్త గ్రహం గాను, ఒక చరిత్రకారుడు చరిత్రకు పునాది గాను, ఒక పురావస్తు శాస్త్రవేత్త సంపదల గని గాను, ఒక సాధారణ రైతు అన్నం పెట్టే అమ్మ గాను, భావిస్తారు. అదే మనలాంటి సాధారణ ప్రజానికం భూమిని దేశంగా భావిస్తాం. ఈ భూమి కోసం చేసిన స్వతంత్ర పోరాటాలు మనలో ఈ దేశం పట్ల, నేల పట్ల దేశభక్తిని, ఐక్యతను పెంపొందించాయి.        భూమి పై జీవుల పుట్టుక -          ...