ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

I paint myself as a Saint

  MYSELF:  'Bhagyamati', it's my pen name. I love to introduce myself as Bhagyamati, more than my true name. I'm nothing in my past, now I'm a blogger, since my age of 13, I'm a writer, still I'm a blogger just the term was changed. I'm much inspired by Jay Shetty 's book, THINK LIKE A MONK.  Here the author told that " Train your mind for peace and purpose every day". I'm truly following this principle.  EARLY MORNINGS: Actually I'm not a morning person. So many of my friends studying in complete nights(night outs) in semister exams... University days. But I didn't. Sleep is enough to me. Ofcourse i wrote well, got good marks 😅. About 2 years ago, I was greatly inspired by a book " 5AM CLUB". ROBIN SHARMA is the author. Actually I listen it as audio book, will give you the link below. 5AM Club audiobook Wakening by 5AM and going by walk alone is a wonderful thing. There is no traffic, no people, no busy schedules. On

చుక్కల్లో చందమామ నీవేనా!.

 దివ్వెలా... వెండి పువ్వులా... ఆకాశంలో విరబూసిన చందమామ. చట్టా పట్టాలేసుకుని చుట్టూ మూగిన చుక్కలు. నిశ్చలంగా... నిర్మలంగా... కనుబొమ్మ  పైకెత్తి చూసే చందమామ, తన చూపు తట్టుకోలేక, కొంగు పట్టుకుని పది గజాల దూరం పరిగెత్తిన కొన్ని నక్షత్ర భామలు. తలుకుతో... తమ కులుకుతో... చంద్రున్నే చూసే మరి కొన్ని భామలు. తమ వంక ఓరగా చూసే కనులకు బదులుగా... చూపులకు చుపులిచ్చి, చిరునవ్వులతో హృదయాన్ని మండించుకున్న కొన్ని భామలు. సుగుణాల చంద్రుణ్ణి భక్తితో చూస్తూ... ఆ చూపే అదృష్టంగా భావించే కొన్ని చుక్కలు. చీకట్లో చప్పున దీపాలు వెలిగినట్టు మెరిసి ఆరే కొన్ని బిడియపు తారలు. తదేక దీక్షతో చంద్రున్నే చూసే ఇంకొన్ని వగలమారి తారలు. తారలెన్ని రంగులైనా, అవి చుట్టుముట్టిన చంద్రుని వల్లే వాటి రూపురేఖలు. పుడమి నిండా పూవుల వాసన, సెలయేటి నీళ్లలో సన్నాయి మేలము, రోజూ చూసే ఆకాశంలో నూతనత్వము, ఎవ్వనము, కొత్త సౌదర్యపు సోయగము. అన్నీ అద్భుతాలే నేడు ఆకాశంలో... కళ్ళు నులుముకుంటూ చూస్తున్నాను. ఈ చుక్కలకేమి కొత్త రోగము, నిన్నటిలా లేవు మరి. కొత్త పెళ్ళికూతురిలా... నడుమూపుతూ, నవ్వు దాచుకుంటూ ఓరకంట చంద్రునిపై కోరికల బాణాలేస్తునాయి. తమ సౌందర్య ప

ప్రేమలు పుట్టిన క్షణమే!.

 జ్ఞానికి కనబడే లోకాతీతమైన దృశ్యాలలో ప్రేమ ఒకటి. మానసాతీతమైన ఈశ్వరానుభూతిని పొందిన స్థితిని, ప్రేమ మనకు తొలినాళ్లలో పరిచయం చేస్తుంది. ఈ హృదయ మాధుర్యం కళ్ళను ముద్దాడి, గుండెలోని ప్రేమ తంత్రుల్ని మీటుతుంది. ప్రియుని నవ్వు చూసి, భూమిపైన కాలు గంతులేస్తుంది, ఆకాశం తెరుచుకుని మనసుని ఎగరేసుకు పోతుంది. ప్రపంచం వినోదశాలగా... వాస్తవం లేని ఓ సినిమాగా కళ్లముందు సాక్షాత్కరింప జేస్తుంది. కొత్తగా పుట్టిన బిడ్డను చూసి తల్లి ఎలా అర్ధంలేని జోలపాటలను పాడుతుందో... కొత్తగా పుట్టిన ప్రేమ కూడా ఏదో పిచ్చిపాటలు పాడుతుంది. మాటలతో ఇంతకన్నా వర్నించగలనా? నీ అందాన్ని అంటూ... కవితా బోధనలు మొదలవుతాయి, ప్రేయసి ప్రియుల మధ్య. కళ్ళు మాత్రం తెరువలేము ప్రేమలో... హృదయమొక్కటే ఇంద్రియ మిక్కడ. వాస్తవికతపై యుద్ధం చేసి, ప్రేమ ఆధిక్యం సాధిస్తుంది. ఈ అంతఃశాంతి ప్రేమలో ఉన్న వాడికే అర్థమవుతుంది. బయట ఉన్న జ్ఞానికి అర్దం కాదు. బయట వానికి అన్నీ సందేహాలే!. ఈ ప్రేమ జ్ఞానికి అన్నీ వాస్తవాలే. కనీసం తన ప్రియుడితో ఉన్న క్షణాలలో కలిగే దుఃఖం,సంతోషం... ఆ క్షణకాలమైనా వాస్తవాలే. భక్తులు, యోగులు... ప్రేమికులు ఒకే కులం వారే. లోకాతీతమైన మైకంలో ఆడి ప

నా కలల సహచరుడు

 మిరుమిట్లు గొలిపే ఓ స్వప్నం, బంగారు రథం పై వచ్చే నా రాజాధిరాజు, రాత్రి పరిమళ దినాలలో అరణ్య మార్గాల వెంట వస్తున్నాడు, నిరంతరం వస్తూనే ఉన్నాడు. విప్పారిన కనులతో నేను రెప్ప వేయలేదు. అమాంతం నా ముందే వచ్చి ఆగిన రథం. జ్వాల వలే మెరిసే అతని కన్నులు, తీక్షణమైన చూపులు, మెడలో సుగందాల రోజా మాల, పన్నీరు జల్లినట్టు దేహ పరిమళం. శక్తి పూర్ణమైన శరీరం, అలా వచ్చి రోజూ కలలో ఇలా వెళ్ళేవాడు. ఎవరీ రాకుమారుడు, నిజం కాదని అతని రాకను ఎలా నమ్మను. వచ్చిన వాని జాడలు ఇక్కడే మిగిలి ఉన్నాయి. రాలిపోయిన రోజా పులరేకులు దోసిలిలో పట్టుకుని చూస్తున్నాను. నా ప్రియుని రాక నిజమని తెలుపుటకు ఇవే ప్రేమ పూర్వక సాక్షాలు. తెల్లవారక ముందే లేచి ఉదయ విహంగమై అలా ఒకసారి గాలిలో ఎగురుతుంటాను. ఆ పూల సుగంధాలు, పన్నీటి గాలులు నాపై జల్లిన వానికోసం మరల మరలా... కలగంటాను. మధురమైన స్వప్నం మరల వచ్చింది. మనుజుడేనా వీడు? దేహమంతా... దైవ కణములు నింపుకున్న పురుష పుంగవుడా? కలలో కానుకగా... నా కరములు అడిగాడు, నన్నా నువ్వు అడిగేది? అనేలోగా పరిహాసంగా నవ్వి మాయమయ్యాడు. అతనిని ప్రేయాబిక్షిత్తున్ని చేయగల అవకాశమే రాకున్నది. ఇతనిని హృదయంలో బరిస్తూ... హత్తుకోడాన

ఈశ్వరుని ప్రేమలీల

ఇదంతా ఓ గానం, ఆనంద నృత్యం. నా ఊహాలలో ఉన్న భగవంతుడు నా కనుల ముందుకు వచ్చిన రీతిన, ఎన్నో ఆశలు నింపుకున్న హృదయం ఒక్కసారిగా పెల్లుబికి, కనుల నీరై దొర్లి, పొంగి పొర్లిన సంతోషం. దేవుని చిన్ని తండ్రిగా భావించి నేను తల్లినై ఆత్మతో ఆలింగనం చేసుకుని నా చిన్ని తండ్రి బుగ్గల్లో... నవ్వులు చూడాలని నుదిటిపై ముద్దులు పెట్టాను. తన అరచేతులను నా చెంపలకు ఆనించుకుని అరవిరిసి మురిసాను.  దేవుని తండ్రిగా, ప్రియునిగా, కుమారునిగా పూజించి సేవించిన భక్తియుగ కాలపు కడలి నుండి ఓ కెరటమొచ్చి నా పై పడ్డట్టుంది. చలించి విలపించేతలా నన్ను దేవునితో అనుసంధానించి ఉంచింది. ఈ భక్తి గానం నాలో ప్రతిధ్వనిస్తూ... కొత్తగా నన్ను అంకురింప జేస్తూ... తదేకంగా దేవుని కన్నులలో లీనం చేస్తూ... ఉన్నచోటే నన్ను ఊపిరాడని ప్రేమ ఉచ్చుతో బిగించింది. కదలక నే శిలనై, పరవశించి విస్మయంలో పరుగులీడేలోపు మాయమైన దేవుని ఉనికి, నా కవితా కల్పన. కవి కల్పనలో, కాగితపు బొమ్మలలో ఊహించిన వారమే తప్ప, నిజరూపుడు ఎన్నడు దొరికేనో?  దేవుణ్ణి అసలు యందుకు తలచుకోవాలి? అనే ఆలోచనను పుట్టించిన వానికి కృతగ్నురాలిని. వేప రుచి చూశాకే తీపి రుచి అవగతమవుతుంది. కన్నులు కాల్చేంత మెరు

ఎక్కడే ఓ మనసా! నువ్వు?

 ప్రపంచమంతా పరిబ్రమించి వచ్చే హృదయాన్ని, ఒకే చోట ప్రక్కటెముకల మధ్య పట్టి ఉంచగలవా? ఎక్కడో కోతి కొమ్మచ్చ్చులాడే మనసును, మెదడు నరాలలో కట్టి పెట్టగలవా? చూపుడు వేలితో చుట్టూ చూస్తూ... పిడికిడంత మనసుని కొల్పోయావా? చుక్కల్లో ఏదో చూస్తూ... నిలబడ్డ నేల మరిచిపోయావా? ఉత్తి పుణ్యానికైనా... గుర్తుకు రావా నీకు నువ్వు? అంతలా చచ్చిపోయావా? అవమానాలకు, అనుమానాలకు, మత్తు సీసాకి, పొగాకు చుట్టకి... నీ మనసుని అమ్ముకున్నావా? ప్రేమను ప్రణయానందం తో పైన కప్పుకునే నువ్వు, నీలోని బాధను, అవేసాన్ని మాత్రం దేవుని పై అపనమ్మకంతో, అవిశ్వాసంతో నిందిస్తావు, ఇది భావ్యమా? ఎవరో మనలా లేరని నిందించడం కన్నా... మనలో ఇంకిపోయే కన్నీటి చుక్కల్ని మన గొంతులోనే మింగేయడం మంచిది కదా! సాగర కెరటాల్ని కౌగిలించుకునే నువ్వు ఎంత ఉప్పు తాగేవు? ఇప్పుడు నీ కన్నీరు నీకు చేదయిందా? జ్ఞాపకాలు ఎన్నటికీ తియ్యనివే, కాలానుగుణంగా నిన్ను, నన్ను మార్చదగినవే! ఏ తోడు లేక పుట్టేటి మనం, ఏ తోడు కోసం ఇలా సగిలా పడి వేడుకుంటున్నాము? పరిణతి చెందిన మనసుకి ప్రణయ గీతాల అవసరమేమున్నది? ప్రాణాధారమైన ఆయువు నీ దేహమంతా... ప్రవహిస్తుంటే, నీవే ప్రాణమని వేరొకరికి అభ్యర్ధన లేఖల

నా ఆత్మలో ఉన్నవాడు.

కలడు ఇందును, కలడు అందును, కలడు ఆ కళకళలాడు ముఖము వాడు. కలడు ఆ... రేకులు విచ్చిన గులాబీ కనులవాడు. కలడు ఆ నేర్పరి చూపులవాడు. కలడు ఆ సంపెంగల వేళ్ళవాడు, సరిగమల మాటలవాడు. కలడు ఆ నీరజ నయనములవాడు, నిర్మల హృదయము గలవాడు.  నాలోనే కలడతడు, నా అత్మ లోని చెలికాడు. నా తండ్రి యతడు, నా బిడ్డడతడు.  నా సర్వాంతర్యాముడతడు, నా సర్వేశ్వరుడతడు. మెరుపుల ననుకరించు కన్నులవాడు, ఉరుముల ననుకరించు స్వరములవాడు, పాల మీద మీగడలా...మెరిసే బుగ్గలవాడు, నవ్విన బుగ్గల్లో చంద్రవంకల వాడు, చంద్రవంకల ఒడిలో ముత్యపు రాశులు గలవాడు. ముద్ద పెదవుల మధ్య చిరునవ్వును సర్దిపెట్టెడి వాడు. కలడా... మోహనాంగుడు కలడు నా యందు, నా అత్మ యందు. కర్పూర, కదంబ పుష్పముల గుమగుమల దేహము వాడు, కరమున కటిన ఆయుధములను దరియించెటి వాడు. అరవిందాక్షములను అరమూసి, తపస్బంగిమలో తరియించు యోగి పుంగవుడు, కలడు నే చేసేటి పుణ్యమందును, నా పాపముల కోతయందును. కలడతండు ఈ కలికాలపు ప్రతి కర్మ యందును. నన్ను భాదించు ప్రతి దుక్కమందును. నిజమై నుండు తాను నేనందుకునేటి ప్రతి ఫలమునందును. ముద్దు చందురుడు తోడై తన మోముపై వెన్నెల చిమ్ముతుంటే... కాలి మువ్వలను, గుండెకు కట్టుకుని పరవశించి నేనాడుతుం