Colorism discrimination: వర్ణ వివక్ష లేదా చాయ వివక్ష. భారతీయులంతా అందమైన వాళ్ళే, ఎందుకంటే మనది భారత దేశం. ఈ దేశమే అందమైనది అయినప్పుడు, ఈ భూమి మీద పుట్టిన మనమంతా అందమైన వాళ్ళమే కదా... ఇక్కడ మనవారు బంగారు, పసుపు వర్ణాలు కలిపి పుట్టాము. మన వారిది కంటికి ఇంపైన రంగు. ✍️Bhagyamati బ్రిటిష్ కాలం నుండి నిన్న మొన్నటి తరాల వరకు మనమంతా సమాజంలో కులం మతం పేరుతో వర్గాలుగా విడిపోయి ఉండేవాళ్లం. చదువు, సంస్కారం మనల్ని వాటి నుంచి బయటకు తీసి భారతీయులం అని చాటింది. నాడు దక్షిణాఫ్రికాలో మ హాత్మా గాంధీని రైలు నుంచి గెంటి వేసింది ఆయన ఒంటి రంగు కారణంగానే. అమానుషమైన వర్ణ వివక్షను అంతమొందించాలని పాటుపడిన మహాత్ముని మాతృభూమి లోనే తామిప్పుడు జాతి వివక్షను ఎదుర్కొంటున్నట్లు ఆఫ్రికన్ జాతీయులు ఆరోపిస్తున్నారు. Dark-skinned Indians ఈ ఘటన జరిగి నేటితో 125 ఏళ్లు నిండాయి. అది దక్షిణాఫ్రికాలో గాంధీని రైలు నుంచి బయటకు గెంటివేయడం. ఒకరకంగా జాతివివక్ష లోని రాక్షసత్వాన్ని గాంధీకి రుచి చూపింది ఆ అవమానమే. ఈ జాతివివక్ష భారతీయుల రంగులో నుండి పుట్టిందే. నాడు తాను ఎదుర్కొన్న అవమానం, అప్
Telugu and English writings