ఇద్దరం కలిస్తే నిండు పున్నమిలా ఉంటుంది. అందుకే విధికి అసూయ పుట్టి అప్పుడప్పుడు దూరం చేస్తుంది. కనుమరుగైన వాని కథలు రాస్తూ... కనిపించక పోతాడా అని కూనిరాగం తీస్తూ... ఈ కవ్వింపుల సవారీ చేస్తుంటాను, ఈ గతం తాలూకు గమనంపై, నా కలం తాలూకు కవనంపై. ఏ నందనం నుండి ఈ నారు తెచ్చుకుని నాటుకున్నానో... నా హృదయ మందిరమంతా... అతని పూజా మందిరమైంది. ఈ వికశించిన పూవుల తీరులో... ఈ తియ్యనిదనం, అతను నింపి వెళ్ళినదే. వెన్నెల వెలుగులు, రవిబింబ దీప్తులు... అల్లంత దూరాన మెరుస్తుంటే... అతని కన్నులే జ్ఞాపకమొస్తాయి, అస్తమానం... అనుదినం. సగం చదివిన పుస్తకంలా ఎప్పటికీ నాకు పూర్తిగా అర్ధం కానివాడు, అర్థమైతే ఆరాధించడం మనేస్తానేమోనని మధ్య మధ్యలో మాయమౌతాడు. ఈ మాయమయ్యే రోజుల్లో నా తడి రెప్పల మీద పాకేటి ఈ కన్నీటి చుక్కలు, అతని చేత పొదిగిన ముత్యాలే. వెళ్లినవాడు వస్తాడని తెలుసు. అయినా మనసు ఊరుకోదే?! వెదకడం మొదలెడుతుంది. పక్షి రెక్కలు ఛాచుకుని ఈ పచ్చని కొమ్మల మధ్య ఎగరలేక ఎగురుతుంటాను. ఎగిరేటి దూరం ఏందాకో? యదకే తెలుసు, రెక్కలకేం తెలుసు?. ఆకాశమంతా... చాచుకుని అలిసిపోయేదాక ఎగురుతాయి. అంది అందని అందమే ముద్దు అన్నట్లు, చేతి...
Telugu and English writings