చెరిగిపోయే జ్ఞాపకాల్ని చెదిరిపొనీకుండా... చేతులలో పట్టుకుని పుస్తకమంతా అలుముకున్న ప్రేమ కావ్యం ఇది. ఇది నాపై నాకున్న ప్రేమో... అవతలవారిపై పెంచుకున్న ప్రేమో... పొడిబారిన మనసులో... కన్నీటితో తడిచిన తలపులను మళ్ళీ మళ్ళీ వల్లె వేసుకుంటూ... రాసుకున్నాను. ఇవి ఒక రాయి రాసుకున్న రాతలు... రాయి నుదిటిపై చెదిరిన గీతలు... నా మాటలను ఆపేసి ఆ సముద్రం వైపే చూస్తున్నాను, అందులో నాకు గోచరించని రహస్యమేదయినా ఉందని. అది నా వర్తమానాన్ని శాసిస్తూ, భవిష్యత్తును బోధిస్తూ ఉందని!. నా బాధ లోతు, ఈ సముద్రపు లోతుకేమీ... తక్కువ కాదు. అట్టడుగులో రత్నగర్భ మున్నట్లు, నా గుండెలోనూ... ఓ గుడి దర్శనమిచ్చింది. మనుషుల్లో దేవుణ్ణి చూస్తూ... వెంబడిస్తున్నాను. దేవుడు దొరికే వరకు వెంబడిస్తాను. గుండె లోతుల్లోంచి వచ్చే గురుతుల్ని, ఎండుటాకుల్లా... రాలిపోయే ప్రేమ లేఖలని, అన్నింటినీ ఆత్మ కేసి కుట్టుకుని, వాస్తవానికి దూరంగా... గతంలోనే మిగిలిపోయిన నా గొంతును సరిచేసుకుని కొత్త పాటలు పాడటానికి తయారవుతున్నాను. ఏ పల్లవి నన్ను పల్లానికి చేరుస్తుందో? ఏ చరణం నాకు చరమగీతం పాడుతుందో? ఏ పాట నా నోట ప్రాణధారగా నిండుతుందో? నాకే తెలియని సందిగ్ధంల...
Telugu and English writings