ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

చేతి వేళ్ళలో ఏముందో!

లేత బెండకాయ లాంటి వేళ్ళను, తరిగి తాలింపు వేసుకోక, కలం పట్టి కాగితం పై ఈ కొట్లాటలెందుకు? కౌగిలించుకుని అరచేతుల్ని కమ్మగా చంపకేసి రుద్దుకోక, ఈ పీకులాట లెందుకు?. పిచ్చి రాతలు రాసుకుని పెద్ద కవినై పోదామనా?! ఈ కాగితాల కట్టలు తీసుకెళ్ళి ఏ మిచ్చరు కొట్టోడికో తాకట్టు పెడదామనా! కాగితమైనా కాకపోయనే, పాత ఫోనులో ఈ పీతాంబరాన్ని ఎవడు చదువుతాడు?! ఇసుకపై అలిగి వెనక్కు వెళ్ళే అల లాగా, విసుగుపుట్టి ముందుకు తోసే సంద్రం లాగా... మధ్యలో ఈ అల కే పట్టింది, లేనిపోని బాధ. ఇష్టపడి ముందుకు సాగదు, కష్టపడి వెనక్కు పోదు, ఏమి ఈ కలం రొధ. పిసినారి సిరా బుడ్డి తప్పా? పిసరంత దైర్యం లేని గుండె తప్పా?  చిన్నప్పటినుండి అమ్మ చెబుతోందిగా చందమామ కథలు, మళ్ళీ నువ్వెందుకు మొదలెట్టావు? ఈ కల్లబొల్లి మాటలు. ఒకేమాటను ఒక్కోరకంగా సందుగొందుల్లో తిప్పి మళ్ళీ అక్కడికే తెస్తావు. వచ్చే పోయే దారుల్లో మళ్ళీ కొన్ని ఒత్తులు, పొల్లులు ఏరుకొస్తావు. నీకెందుకు చెప్పు? ఈ దేవులాట. చిమ్మ చీకట్లో నల్లపిల్లికై  వెతుకులాట.  మాటలన్ని వండి విస్తర్లో వడ్డించుకొని, ముని వేళ్ళతో ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకోక, ఎందుకే 'bhagi' నీకీ భాద. అక్షరం అక్షరాన్న

శ్రీవారి సేవలో తరియించిన భాగ్యము

ఇప్పుడే గుడి మెట్లు ఎక్కాను, భక్తులతో... అలయమంతా రద్దీగా ఉంది. సాక్షాత్తు శ్రీనివాసుని దర్శించాలని, శ్రీవారి సేవలో తరియించాలని వేయి కనులతో వేచిన అలివేలు మంగనయి అతని కోసం ఎదురు చూసాను. కోర్కెల చిట్టాలతో భక్తుల పాట్లు ఏలనో?. నెరవేర్చు వాడు నెరవేర్చక మానడుగా!. కర్మలను ఆయనే రాయును, కార్యములు ఆయనే చేయును. ఇంతలో ఈ తన్నులాట లెందుకు? తరియించక! అనంత పద్మనాభుడయి ఆ శయన మందు పవళించినా... మానస లీలా చోరుడై మురళిని ధరియిన్చినా... శ్రీరామ చంద్రుడై సీతను వరియించినా... నీల మేఘ స్యాముడై యశోద ఒడి దెంచినా... ఆతను ప్రతి అవతారమందు పవిత్ర రూపుడేగా, పరమానంద భూషుడేగా. అతనిక ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు.  నాభి యెందు పద్మము కలిగినా... పద్మ మందు లక్ష్మిని కలిగినా... లక్ష్మి హృదయమందు మహా విష్ణువతడు. క్షీర మంత సంద్రములో స్నానమాడేటి పాల నురగల కనులవాడు. చేప పిల్లలకు ఈత నేర్పే చేతి వేళ్ళ వాడు. చంప మీద నునుపుటద్దపు చెక్కిలివాడు. చెక్కిలి యందు చంద్రవంకలా... చుక్క కలవాడు. చదరంగపు చతురతల చమత్కారి వీడు. అమ్మ పద్మావతిని, అలివేలు మంగను, అసలమాంతం ఏడు కొండలను పట్టిన వాడు. ఒట్టి చేతులతో... గట్టి హుండీలను పట్టినవాడు. పరమ నేర్పరి

కొలను పక్కన మేమిద్దరం!

ఓ రాత్రివేళ, కొలను పక్కన... మేమిద్దరం చేతులు పట్టుకు కూర్చున్నాము, పక్కనున్న కొబ్బరి చెట్టు చాటు చందమామను చూస్తున్నాము. ప్రేమ పరవసులమై మేము తనివితీరా నవ్వుకున్నాము. మా నవ్వు విని చుక్కలన్ని తప్పుకున్నాయి. కొబ్బరి చెట్టుకు కోపమొచ్చి గట్టిగా రెమ్మలను విదిలించింది. పక్షుల జంటలు పైకేగిరి పోయాయి. ప్రకృతికెందుకు ఇంత అసూయ? అతని పట్టపు రాణిని నేనయినందుకా? చంద్రుని చివరి కిరణాలు మా చర్మం పై చిందాయి. నా ప్రేమ నిండిన గుండెను తన భుజంపై వాల్చి, తన వెచ్చని శ్వాసల్లో... పచ్చిక పై చినుకులా మెరిసాను. కొలనులోని నల్లని నీరు తాపమోపలేక నురగలు కక్కింది. చిన్ని చేపలు తల్లడిల్లి పైకెగిరి పడ్డాయి. నిర్మలమైన అతని కన్నులు, నిశి రాతిరిని కూడా వెన్నెల చేస్తాయి. అందుకేనేమో! ఈరాతిరికింత అలక, జంట చిలుకలను చూసి ఓర్వలేక. అందమైన అతని మోము మొత్తమంత విరిసిన మందార పువ్వు, చెక్కిలంతా... చెమటలు, గంధపు చినుకులు. అతను నా ప్రేమ ఋతువు. ఏడాదికొకమారు కాదు, సంవత్సరమంతా చిగురించే ఓ పచ్చటి పూల మాను. అతను నా గుండె తోటలో పరిమళాలు జల్లే పన్నీటి పువ్వు. మొగలి పూవులు అతని మోము చూసి విచ్చేను, నా మగడి అందం ఎవరికొచ్చేను?  చూడకుండా అతనిని ప్ర

నేనెప్పుడో... నువ్వయ్యాను

అంతరాత్మను అడిగి మరీ రాస్తున్నాను. నా గుండె నేను తవ్వుకుని చూస్తున్నాను... లోతైన సమాధానం కోసం ఎదురు చూస్తు రాస్తున్నాను! ఏ కారణం నా చేత, ఈ కవిత్వం రాయిస్తుందో... ఆ సమాధానం వెలికి తీసి రాస్తున్నాను!  నా రాతల వెనుక రహస్య మేధో ఉందని, అది నా ఆత్మ లోనే నిదిరిస్తోందని, బాహ్య ప్రపంచపు బలహీనతలకు లొంగనిదని  నాకు నేను బలంగా చెప్పుకుంటున్నాను. నేను నిజాయితీగా రాసుకున్న ప్రతిమాటలో నా నువ్వు, అనే నేను ప్రతిబింబిస్తూ... ఉన్నాను. జీవితంలోని ప్రతి అనుభూతిని, అనుకూల ప్రతికూలతల మధ్య వేరు చేసుకుని చూసుకున్నాను. రెంటి మధ్య నా జీవితం జీవం నింపుకున్న తెల్ల కాగితం. అచ్చు తప్పులు లేవు, వ్యర్థ అర్థాలు లేవు. ప్రేమకు అడ్డంగా... పరచిన నా గుండె తప్ప ఇక్కడేమి లేదు. ఒక వైపు నేను సన్యాసిని, మరోవైపు ప్రేమ ఉపన్యాసిని. రెంటి మధ్యా నేను సగం రాయిని, సగం ప్రేమని. నిత్యం నాలో నన్ను అన్వేషించుకుని అక్షరాలతో... అభినయించే అనుభూతిని. ప్రతిరోజూ పరవశించి ఆడుకున్నాను, పసిపాప లాగా పిచ్చి గీతలు గీసుకున్నాను. నా పేరు నాకు పరిచయ మయినప్పటి నుండి నేను నాతోనే ఉన్నాను. నిర్మలమైన నా కన్నుల్లోనే... నా సుఖము, దుఃఖము చూసుకున్నాను. కన్నీళ్లతో

నా పొగరు నా దేశపు జండా అంత!

నా దేశం మూడు రంగుల జెండా కాదు,  నా దేశం మూడు అక్షరాల పదం కాదు, నా దేశం మూడు పార్టీల ఎన్నిక కాదు. నా దేశం అతి పెద్ద ప్రజస్వామ్య దేశం. నా దేశం అతి పెద్ద రాజ్యాంగ పుస్తకం. పరాయి సంకెళ్లు తెంచుకున్నా... మనలో మనం వేసుకున్న సంకెళ్లు తరాల తరబడి చేతి గాయాలై... నెత్తురోడుతుంటే... పుట్టిన అక్షరాల కత్తి ఈ రాజ్యాంగం. కులం గుంపుల కొట్లాటలను, మతం చేసిన మాయలను స్మశానం పంపి సమాధి కట్టింది ఈ రాజ్యాంగం. పదాలు జొరబడలేని అనుభవాలు యెన్నో ఉన్నాయి. దేశం కోసం విడిచిన ప్రాణలెన్నో ఉన్నాయి. చరిత్ర కెక్కిన పోరాటవాదులు, చరిత కనులు చూడని సమర యోధులు...అందరినీ స్మరించుకుందాం... ఎపుడో ఏడాది కొకసారి ఇది మన ధర్మం. సహనం కట్టలు దెంచుకున్న కవులు కలమెత్తారు, విప్లవ గాయకులు గళమెత్తారు, మువ్వన్నెల జెండా రక్తపు మడుగుల్లో తడిసింది. పేదవాడి కడుపు ఆకలికి ఏడవలేదు, అన్నానికి ఏడలేదు, స్వతంత్రం కోసం అందులోని సమానత్వం కోసం ఏడ్చింది.   నేడు ఉన్నవాడు, లేని వాడు, లేనే లేడు ఇది నా దేశం. ఇక్కడ మనమంతా... సమానం. మూడు రంగుల జెండా కప్పుకున్న సీతా కోకలం. విదేశాలకు ఎగిరే పక్షులు కొన్ని ఎత్తుకొచ్చిన జ్ఞానం, ధనం, అమ్మ భరతమాతకు ఇస్తుంటే, తత్వ మెరిగ

నువ్వు ఉన్నావా? రఘురామ

  నిజమే! కొన్ని ఉంటాయి అలా... ఆకాశమంత ప్రేమను ఆరుబయట పరచి, వెన్నెల ముగ్గు పెట్టి, వేడి దీపపు వెలుగుల్లో... రాముని కోసం ఎదురు చూసిన రోజిది. ప్రతి పడుచు సీతలా... ప్రతివాడు హనుమంతునిలా... పరవశించి, పాడుకున్న రోజిది, ఆ పరమ పురుషునితో కబురులాడిన కాలమిది. ఇంతటి వాడు అరుదెంచితే... గుండె చీల్చి, గుడి కట్టే గుణమిది. రాముడు ఏలిన రాజ్యమందు, రాగల కోవెల రూపమిది.  అందమైనవాడు ఏది పలికినా... అందమే అన్నట్లు, సత్యము మాత్రమే పలికే ఈ సుగుణ వంతుని ఎన్ని పొగిడినా... ఎంత కీర్తించినా... పదములే కరువగును. ఇతని పాదముల మోకరిల్లిన, జన్మమే దన్యమగును.  ఊహాలకందినవారు కవులు, ఊసులాడిన వారు పుణ్యాత్ములు, పాడి భజనలు చేసినవారిక పండితులు, అనుదినం అతనిని చూసేవారు పరమభక్తులు, కీర్తించగా... పరవశించే వారిక నాలా దాసులు. ఆజానుబాహుడు, అపురూప సఖుడు... సఖి సీతకే కాదు పడుచులందరికి ఆదర్శ పురుషుడు. పరమాత్ముడని, పొగిడిన పలువురు. కాదు, పవిత్రుడు మాత్రమేనని పలికిన కొందరు, అందరి మధ్య అతని కథనం ఆకర్షణీయం. కథ అయితే కలలా... కరిగిపోయేది. నిజమైనది నీరజాక్షునికి కోవెలైనది. సుందర పురుషుని సున్నిత వైనం,  కలువల కన్నుల కాంతి వీక్షణం,  మందార పెదవుల

మరుజన్మకూ... నీ చెలియనే మరి!

ఆశల ఆకాశం అంతెత్తులో ఉంది. అక్షరాలు మబ్బులలో తేలి పోతూ... ఉన్నాయి. కోరికల చెట్టుకి కొత్త పూలు పూశాయి. కోసి మాల కడదామంటే...  తనివి తీరా వేద్దామంటే... తరచి తరచి చూద్దామంటే... అసలతను ఏడి? రాణి గుండెకు రాజైన వాడు రానే వస్తాడు,  రాగ బందపు ప్రేమ గంధము తేనెతెస్తాడు.  అందమైన చెలికాడు అక్కడెక్కడో ఉన్నాడు. ఆకాశం శూన్యమై నల్ల ముఖం వేసింది. అందరానివాడి కోసం  హృదయమరువు చాచింది. అసలెందుకే మనసా? అలసిపోవే కాసేపు. అతని హృదయ మెందుకు నీకు? నీ హృదయముంది చాలదా... తుది వరకు. జారిపోకే పిచ్చి మనసా! జారు తున్నావని తెలుసు కనుక. లేత ప్రాయము కాదిది, మరల దొరకదు పోయినది. తొంగి చూడకు గుండెలోకి, తొలకరి జల్లు కురువదు. తొణికిసలాడే మనసుకు తొందరెందుకు ప్రతి మాటకు? ఆగి పలికే మాటలకు అర్థముంటుంది, ఆగకుండా పరిగెడితే ప్రేమ వ్యర్ధమవుతుంది. అన్ని తెలిసిన వేళ ఈ అలజడి ఎందుకు? అవతలి వానికి లేని ప్రేమ నీకెందుకు? ఎదురు చూసిన మనసుకేం మిగిలింది? ఆకలి దప్పులు లేక క్రిందికొరిగింది. ఇన్ని ప్రశ్నల మధ్య ఇతనెక్కడ?  ఇక్కడెక్కడో ఉన్నావని,  ప్రేమ చినుకులన్ని ఒడిసి పట్టి, ఒడిన కట్టి, మనసు దారము మధ్య పెట్టి, పలుకులన్ని అల్లికలై... పలుకుతున్నా నీ