ఆ పేరు ఎవరు పెట్టారో.. కానీ, కళ్ళు మూసుకుంటే పగటిపూట సూర్యకిరణాలకు మెరిసే... పచ్చ పవిట కప్పుకున్న పైరులా... కనిపిస్తాడు. చల్లగాలి, ఏటి నీటిని తాకి తగిలినట్టు హాయిగా ఉంటాడు. నవ్వితే దాన్నిమ్మకాయ పగిలినట్టు నోటి నిండా ముత్యాల రవ్వలతో కనువిందు చేస్తాడు. మాట మాటను మంచు కప్పి చల్లగా చెబుతాడు. చెవిపై చెక్కిలిగింతలు పెడుతాడు. రూపమేమో తెలియదు నాకు?! అంతగా చూడలేదు. ఒక్కసారైనా కలవాలని కాలం తొందర పెడుతోంది. కళ్ళతో మాట్లాడుకోవాలని ఆశపడుతోంది. పరిచయమైనది కొంతకాలమైనా... ప్రేమలో అడిగిడి చాలా కాలమైనట్టుంది. ఈ మనసు గందరగోళంలో పడింది, ఆ సుందరవదనుని తలపులు తప్ప ఏ తిండి, నిద్ర వద్దంది. నక్షత్రాలను లెక్కబెడుతూ రాత్రంతా... ఎన్నో క్షణాలను భారంగా గడుపుతున్నాను. ఎప్పుడూ... మాటలు విని సంతోషపడడమే తప్ప, ఒక్కసారి కలుద్దామా? అని అడిగే ధైర్యము చనువు లేవు. కలిస్తే బాగుండు! ఆ కొన్ని గంటల్ని ఇంకొన్ని జ్ఞాపకాలుగా మలుచుకొని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. నేను అనే నా రెండక్షరాలను నీతో కలుపుకోనుగాని, నీలోని కొన్ని క్షణాలను నాలో కలుపుకుంటాను. వెన్నెల వెలుగుల్లో నిన్ను చూసి నాలోని చీకటిని తరిమేసుకుంటాను. నా గుండె నిండ...
Telugu and English writings