పగలంతా పరుగులు తీసి తాపత్రయపడ్డ మనసు సాయంత్రం కుదుట పడకుంది. రాత్రి జోల పాడి ప్రేమగా లాలించే ఒడి కరువైంది. ఈ మనసు పూర్వ చరిత్ర ఏమిటని దీని ఆచూకీ కనిపెడదామని బయలుదేరాను. చూసిన వాళ్లకి మరోలా అర్థమవుతుంది ఈ నవ్వు, కానీ ఆమె అంతరంగం ఏంటో ఆమెకే తెలుసు. నేను అసలు లేనట్టే ఉన్నానా? నన్ను నేనే క్షమించుకొని బ్రతుకుతున్నానా? అద్దంలో నా చూపు నుండి నేనే తప్పించుకు తిరుగుతున్నానా? ఎన్నో కథలను చెప్పే నా కనులు, ఎంతో రాసిన నా చేతులు... ప్రేమ ముందు చులకన అయ్యాయా? చనువిచ్చి హృదయం, గతిలేక పడి ఉందా? బహు చచ్చుగా ఈడుస్తూ జీవితం సాగుతోందా? జీవితపు వంకరదారుల్లో... పక్కుమని నవ్విన నా నవ్వుల శబ్దం ఇంకా వినబడుతూనే ఉంది. అయినా ఈ నవ్వులో మనసుకు సౌఖ్యం ఉందా? కొండల్లో ప్రతిధ్వనించే సంగీతంలా... మాటిమాటికి నా మాటలే చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అమృత వాక్కులు కాదవి, ఆటవిక అంధకారంలో నలిగిపోయిన అర్ధంలేని ప్రశ్నలు. తలుచుకుంటే ఒళ్ళు జల్లుమనే మాటలు. ఆ ప్రశ్నల మధ్య నమ్రతగా నలిగిపోయిన అనుభవశాలిని నేను. ఇంకా ఇన్నేళ్ల తరువాత కూడా జీవితంలో ఆశ కోసం వెతుకుతూ ముందుకు సాగుతున్నాను. నా ఆత్మగౌరవం కోసం తపన పడటం ఇప్పుడు నా...
Telugu and English writings